ప్రయాణం (రాచెల్ కలోఫ్ స్టోరీ) మరికొన్ని అమెరికా కథలు
... వేల సంవత్సరాల క్రితమే వేరుపడీ, మేమూ ఆర్యులమనే చెప్పుకుంటూ ప్రస్తుతం ఇరాన్, ఇరాక్, టర్కీల్లో స్థిరపడి వారికొక ''కుర్థిస్తాన్ కావాలని నిరంతరం పోరాడుతున్న కుర్థిష్లు (యెజిడీలు) వీరంతా ఏమిటీ? అసలు దీనికి మూలం ఏమిటీ?? అంటున్న నా ఆలోచనలకు చక్కగా పూర్వాపరంగా సమాధానమిచ్చింది 'రాహుల్ సాంకృత్యాయన్' వ్రాసిన ఋగ్వేద ఆర్యులు అనే పుస్తకం. దీనిని విశాలాంధ్ర వారు మిక్కిలినేని సుబ్బారావు గారి అనువాదంతో వేశారు.
నేను పైన చెప్పిన ప్రశ్నలకు సమాధానం మొత్తం పుస్తకం చదవనక్కరలేదు. మొదటి పేజీల్లోని 'భూమిక'ను చదివితే చాలు అర్థమైపోతుంది. అందులోని ముఖ్యమైన విషయాలే ఇక్కడ ప్రస్తావిస్తాను... ఋగ్వేదం నుండి మన లిఖిత సామాగ్రీ ప్రారంభమవుతుంది. దేవుడు అబద్ధం కానీ కమనీయ కళకు ఆధారాలైనందున వారు మనకు అమూల్యంలూ, ఆదరపాత్రులు అవుతున్నారు. ఇట్లే వేదం దేవుని సృష్టి కాదు. దివ్య పురుషుల వాణి కాదు. కానీ అది మన సంస్కృతికి విజ్ఞాన చరిత్రకు కాణాచి. అందుచేత మన సర్వోత్కృష్టమైన అమూల్యమైన నిధి. దీన్ని రచించినవారు, దీన్ని తరతరాలుగా కంఠస్తం చేసి అతి జాగ్రత్తగా కాపాడినవారు మన హృదయ పూర్వక కృతజ్ఞతకు పాత్రులు... ఋగ్వేదం మనదేశంలోని తామ్రయుగమిచ్చిన నిధి...
సప్తసింధు (పంజాబు) ఋషులు రుక్కులను రచించారు. సప్తసింధులోని ఆర్యుల సంస్కృతి ముఖ్యంగా పశుపాలకుల సంస్కృతి. వారికి వ్యవసాయం తెలుసు. ఋగ్వేదాన్ని గురించి నిర్ణయం చేసేటప్పుడు మనం గుర్తుంచుకోవలసిన విషయాలు ఏమంటే....
పేజీలు : 200