Rs.50.00
Out Of Stock
-
+
ఇవి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంపై 'క్రాంతి' పత్రికలో 2006 నుంచి 2013 వరకు వచ్చిన వ్యాసాలు. ప్రజాస్వామిక తెలంగాణ ఆకాంక్షతో, ప్రజాస్వామిక దృక్పథంతో రాసిన వ్యాసాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఒక సంవత్సరం ముందు దాకా ఈ వ్యాసాలు వచ్చాయి. 'క్రాంతి' సిపిఐ (మావోయిస్టు) రాష్ట్ర కమిటీ అధికార పత్రిక. ఆ పార్టీ సిపిఐఔ (ఎంఎల్)గా, సిపిఐ(ఎంఎల్-సిఓసి)గా, సిపిఐ(ఎంఎల్)పీపుల్స్వార్గా ఉన్న నాటి నుంచి కొనసాగుతున్న అధికార పత్రిక. పార్టీపై నిషేధం లేని రోజుల్లోనూ, ఉన్న రోజుల్లోనూ ప్రపంచ పరిణామాలపై, దేశంలో, రాష్ట్రంలో పరిణామాలపై ఒక విప్లవ పార్టీగా తన అవగాహనను ప్రజలకు చేరవేయడానికి ఎంచుకున్న ఒక పత్రిక. లెనిన్ కార్మికవర్గ అగ్రగామి అయిన కమ్యూనిస్టు పార్టీ పత్రిక ఒక ఆర్గనైజర్ పాత్ర నిర్వహించాలని భావించాడు.
పేజీలు : 158