రాష్ట్ర ప్రగతి ప్రత్యేక హోదాతోనే సాధ్యం

ఆంధ్ర ప్రదేశ్‌లో అనుదినం అనుక్షణం అన్నిదిశలా అందరి నోటా మార్మోగుతున్న ఒకే ఒక్క పదం - ప్రత్యేక హోదా!

అగ్నికణమై చైతన్యజ్వాల రగిలిస్తున్నపదం - ప్రత్యేక హోదా!

అన్ని పార్టీలనూ అందరు నాయకులను చొక్కా పట్టుకుని నిలదీసి మీరు ఎటున్నారని ప్రశ్నిస్తున్న పదం - ప్రత్యేక హోదా!

ఒక్క బిజెపి మినహా ప్రతివారూ ఏదో రూపంలో ఎంతో కొంత పలకవలసి వచ్చిన పదం - ప్రత్యేక హోదా!

కేంద్రం వంచనకూ రాష్ట్రం భజనకూ పర్యాయపదంగా మారిన పదం - ప్రత్యేక హోదా!

ఎన్నికలకు ముందు పుట్టి మరో ఎన్నికల సంవత్సరం దాకా ప్రాణాలతో వుండి ప్రాణం తీసేంత బలంగా నిలదీస్తున్న పదం - ప్రత్యేక హోదా!

కూటములను కూలగొట్టి కుటిలత్వాలను బయటపెట్టి కుళ్ళు కుతంత్రాల రాజకీయాలను వెంటాడుతున్న పదం - ప్రత్యేక హోదా!

రెండు తెలుగు రాష్ట్రాల పాలక ప్రతిపక్షాలన్నిటి సామూహిక నినాదంగా మారింది - ప్రత్యేక హోదా!

ప్రత్యేకహోదా అంటే ఇప్పుడు కేవలం మాట కాదు పోరాట బావుటా.

ప్రత్యేక హోదా అన్నది విభజిత రాష్ట్ర విచారగ్రస్త గాథ, వంచిత ప్రజానీకం హృదయ ఘోష ఉద్యమకారుల ఉమ్మడి కేక.

పేజీలు : 69

Write a review

Note: HTML is not translated!
Bad           Good