ఆధునికాంధ్రకవిత్వం - ఉద్యమాలు, సందర్భాలు (2002) కొన్ని కావ్యాలు- కొందరు కవులు (2008) తర్వాత ఆధునిక తెలుగు కవిత్వంమీద నేను రాసిన విమర్శ వ్యాసాల మూడవ సంపుటి ఈ 'ప్రతిఫలనం'. వీటిలో మొదటి రెండు వ్యాసాలు తప్ప తక్కినవన్నీ 2008 తర్వాత రాసినవే. ఇందులో అభ్యుదయ, విప్లవ, దళిత, స్త్రీ, బహుజన, ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమకవితల మీద వ్యాసాలున్నాయి. ముస్లిం వాద కవిత్వం జీర్ణం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. తర్వాతి సంపుటంలో ఆ కవిత్వంమీద వ్యాసాలుంటాయి. శ్రీ.శ్రీ, గురజాడలమీద అనవసరంగా దాడులు జరుగుతుంటే సమాధానంగా ఎక్కువ వ్యాసాలు రాసినా, రెండేసి మాత్రం ఇందులో చేర్చాను. 'ఆలయాన వెలసిన ఆ దేవునిరీతి' అనే 'దేవత' సినిమా పాటమీద వ్యాసం రాయడం నాకు చాలా ఆనందంగా వుంది. ఒకనాడు బాగా ఇష్టమైన పాటను, సందర్భం మారినప్పుడు ఎలా చూడవచ్చునో చెప్పవచ్చని ఆ వ్యాసం రాశాను. ఇందులోని ప్రతి వ్యాసాన్ని ఇష్టంగా రాశాను. విజయచంద్ర ప్రవాస తెలుగుకవి. ఆయనలో తరగని నిబద్ధత ఆశ్చర్యం కలిగించింది. - రచయిత

Write a review

Note: HTML is not translated!
Bad           Good