ఒకటిన్నర దశాబ్దంపాటు తెలుగు టెలివిజన్‌ జర్నలిజంతో ముడిపడిన ప్రతి విషయాన్ని భిన్నకోణంలో - నిష్పక్షపాతంగా, కరాఖండిగా విశ్లేషించి టీవీ మాధ్యమాల విమర్శను సుసంపన్నం చేసిన రచయిత నాగసూరి వేణుగోపాల్‌.

    'ప్రశ్నార్థకమైన విశ్వసనీయత'లో 2006 జూన్‌ నుంచి 2008 మార్చి మధ్యకాలంలో రాసిన 85 వ్యాసాలు పొందుపరిచాము. ఈ సంపుటికి ముందుమాటలో కీలక విషయాన్ని లేవనెత్తిన ప్రముఖ పాత్రికేయులు శ్రీ వి.హనుమంతరావు గారికి ధన్యవాదాలు. ఈ వ్యాసాల్లో చర్చించిన విషయాలను విహంగ వీక్షణంగా పరిశీలించినా బోధపడే పోకడను పుస్తక శీర్షికగా ఎంచుకున్నాం. ఈ స్థాయిలో ఇంతకు మునుపెన్నడూ మీడియా ప్రశ్నింపబడలేదు. ఒకరకంగా తెలుగు మీడియా దేవతా వస్త్రాలు తొలగిపోవడం మొదలైంది 2006 సంవత్సరం తర్వాతనే. అంతకుముందున్న భ్రమలను, అపోహలను పటాపంచలు చేస్తూ - విమర్శలు మొదలయ్యాయి. ఈ స్థితి ఇంత త్వరగా రావడానికి టీవీ చానళ్ళపోకడలే కారణం. కేవలం పత్రికలు మాత్రమే ఉంటే ఈ స్థాయికి పరిస్థితి దిగజారి ఉండేదికాదు. ఈ పరిణామాలు రేపటి మరిన్ని దుష్పరిమాణాలకు దారి తీస్తాయి. అప్పుడు జరగబోయే పరిశోధనకు మా ప్రయత్నం కొంతవరకు తప్పక దోహద పడుతుందని భావిస్తున్నాను. - డాక్టర్‌ నాగసూరి వేణుగోపాల్‌

Write a review

Note: HTML is not translated!
Bad           Good