రెండవ ప్రపంచ యుద్ధానికి పూర్వం ప్రజలు నాటకాలకోసం ఎగబడేవారు. నాటకం మేధావి వర్గం నుంచి పుట్టినా, మేధావి వర్గాలకే పరిమితం కాలేదు. సామాన్య ప్రజల హృదయాలకు చేరువైంది. ప్రజలు డబ్బిచ్చి చూసి, ఆనందించగలిగే స్థితిలో నాటకం వర్థిల్లింది. 

మహాకవులు వీరేశలింగం పంతులు, ధర్మవరము రామకృష్ణమాచార్యులు, వేదం వేంకటరాయశాస్త్రి, చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు, పానుగంటి లక్ష్మీ నరసింహారావు, తిరుపతి వేంకటకవులు, బలిజేపల్లి లక్ష్మీకాంతం, కాళ్లకూరి నారాయణరావు మొదలైనవారు ప్రముఖ నాటక కర్తలుగా గుర్తింపు పొందారు. వారి రచనల్లో మణిపూసలుగా నిలదొక్కుకున్న పద్యనాటకాలు శాకుంతము, విషాద సారంగధర, బొబ్బిలియుద్ధము, గయోపాఖ్యానము, పాదుకా పట్టాభిషేకం, పాండవోద్యోగము, సత్యహరిశ్చంద్ర, చింతామణి మున్నగునవి. ఆయా నాటకాల్లోని అనేక పద్యాలు తెలుగునాట మార్మోగాయి.

బళ్ళారి రాఘవ, మాధవపెద్ది వెంకటరామయ్య, పులిపాటి వెంకటేశ్వర్లు, యడవల్లి సూర్యనారాయణ, స్థానం నరసింహారావు, ఈలపాటి రఘురామయ్య, పీసపాటి నరసింహమూర్తి, బండారు రామారావు, సురభి కమలాబాయి, గూడూరి సావిత్రి, డి.వి.సుబ్బారావు, ఏ.వి. సుబ్బారావు లాంటి మహా నటీనటులు పాత్రధారణ చేసి ఆ నాటకాలకు కీర్తి తీసుకొచ్చారు. వారి నటనా కౌశలానికి, గాన మాధుర్యానికి ప్రజలు జేజేలు పలికారు.

ఒకనాడు తెలుగనాట ఇంటింటా, రచ్చలో, గొడ్లు కాసే పిల్లగాడి నోటిలో ఆ పద్యాలు మార్మోగాయి. చక్కని వ్యవహారశైలి, తెలుగుదనం ఉట్టిపడేలా ఆ పద్యాలుండటం ఒక కారణం. ఇంతగా ప్రజాదరణ పొందిన అమూల్యమైన పద్యాలు తరతరాలు మననం చేసుకొనేందుకు ఉపయుక్తంగా వుండేందుకు దోహదపడే విలువైన పుస్తకం. తెలుగువారి ప్రతి ఇంటా వుండదగిన అలనాటి కమనీయ నాటక పద్యాల సమాహారమిది. తక్షణం మీ సొంతం చేసుకోండి!

Write a review

Note: HTML is not translated!
Bad           Good