ఒక వందేళ్ళ కాలంలో (1900 - 2000) తెలుగులో అసంఖ్యాకంగా వెలువడిన ప్రహసనాలు, హాస్య, వ్యంగ్య నాటికల్లోంచి ఎన్నిక చేసిన యాభై రచనల సంకలనం ఇది.

అటు వినోదాన్ని ఇటు సామాజిక ప్రయోజనాన్ని సమపాళ్ళలో రంగరించి ప్రముఖ రచయితలు రచించిన ఈ హాస్య నాటికల సంకలనంలో వస్తు వైవిధ్యం పుష్కలంగా ఉంది. కలం తిరిగిన గొప్ప కవులు, రచయితలు వీరేశలింగం, చిలకమర్తి, భమిడిపాటి కామేశ్వరరావు, పానుగంటి, విశ్వనాథ కవిరాజు, మల్లాది అవధాని, మొక్కపాటి, మునిమాణిక్యంలాంటి రచయితలు ఎందరో తమ రచనావైభవంతో ఈ సంకలనానికి అలంకారప్రాయంగా నిలిచారు. ఒక వంక తీవ్రమైన సమస్యను విశ్లేషిస్తూ మరొకవంక పొట్ట చెక్కలయ్యలా నవ్వించడం ఈ రచయితల శిల్ప నైపుణ్యానికి చిహ్నం. తెలుగువారి హాస్యప్రియత్వానికి దర్పణం పట్టే ఈ సంకలనంలోని ప్రహసనాలు, నాటికలు, హాస్యనందభరితమై భిన్న రుచులుగల పాఠకులను సంతృప్తిపరచగలవు.

విశాలాంధ్ర ప్రచురణాలయం తన యాభై ఎనిమిదేళ్ళ సుదీర్ఘ ప్రస్థానంలో నాటకాభిమానులకు అందిస్తున్న అపురూప కానుక ఈ హాస్య నాటికల సంకలనం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good