ఈ సంకలనంలోని వ్యాసాలు, మీడియా, సంస్కృతి, నాగరికత, సామాజిక పోకడలపై వివిధ పార్శ్వాలను తెలియజేస్తాయి. ఈ వ్యాసకర్తలలో అత్యధికులు అధ్యయనపరులుగా ప్రసిద్ధులైన వారే. ఆలోచనా పరులైన వారెవరైనా తరచూ ప్రస్తావించుకునే అంశాల పరామర్శ వీటిలో లభిస్తుంది. అలాగే మన ఇంట్లో సమాజంలో దేశంలో వచ్చిన ఏ అవాంఛనీయ మార్పుల గురించి మనం మధనపడుతుంటామో అవి యాదృచ్ఛికంగా వచ్చినవి కాదని ఈ రచనలు మనకు తెలియజెబుతాయి. కనిపించే తళుకు బెళుకుల వెనుకవున్న అదృశ్య అంతర్జాతీయ హస్తాలను చూపిస్తాయి. వాటి వెనుక ప్రయోజనాలను విశ్లేషిస్తాయి. తెలియకుండానే కొన్ని తరాలు ఆ ప్రభావానికి ఎలా లోబడిపోయామో చెబుతాయి. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good