ప్రతి తరమూ తన 'శక్తివంతమైన సాహిత్యం' ఉత్పత్తి చేస్తుంది. ఇటువంటి రచనకి పాఠకుని జీవితాన్ని అక్షరాల మార్చే శక్తి ఉంటుంది. ఈ సాంప్రదాయంలో ది గ్రేటెస్ట్‌ సేల్స్‌మ్యాన్‌ ఇన్‌ ది వరల్డ్‌ అంతులేని జీవితాలని ప్రభావితం చేసి తీరుతుంది.
ఇదొక కథ, హఫీద్‌ అనేబడే ఒంటి పరిరక్షకుడిది. రెండు వేల ఏళ్ళ సంవత్సరాల నాటిది. తన బడుగు జీవితం నుంచి పైకి రావాలన్న మండే తపనని వర్ణిస్తుంది. అతని నిగూఢశక్తిని నిరూపించుకోవటానికి, బెత్లెహామ్‌ నుంచి పంపిస్తారు అతని యజమాని, గ్పొప కార్‌వాన్‌ వర్తకుడు పాత్రోస్‌ ఒకే ఒక వస్త్రం అమ్మమని. అతను ఓడిపోయి, దాని బదులుగా, జాలి కలిగిన ఒక క్షణంలో, సత్రం పక్కన ఉన్న గుహలో అప్పుడే పుట్టిన పసికందుకు వెచ్చదనం కలిగించటం కోసం ఆ వస్త్రాన్ని కఫ్పుతాడు.
హఫీద్‌ న్యూనతా భావంతో తన కారవాన్‌కి తిరిగివస్తాడు. కాని అతని తలమీద వెలుగుతూ ఒ మిరుమిట్లు గొలిపే నక్షత్రం అతన్ని వెన్నంటి వస్తుంది. ఈ అపురూప దృశ్యాన్ని దైవ సంకేతంగా అర్ధం చేసుకున్న పాత్రోస్‌, హఫీద్‌కి పది ప్రాచీన చుట్టులను యిస్తాడు. వాటిలో ఆ యువకుడు తన కలలన్నింటినీ సాకారం చేసుకోవడానికి అవసరమైన జ్ఞానం పొందు పరచబడింది. ఈ సర్వకాల కథనంలో అసలు చుట్టులలో ఉన్న పూర్తి అంశాలని కూడా విశదీకరిస్తుంది. హఫీద్‌ వాటి విజయ రహస్యాలని పాటిస్తాడు. ప్రపంచంలో అతిగొప్ప విక్రయదారుడవటానికి...అతనికి ఏవైతే సాధించి పెట్టాయో, అవి మీకు కూడా సాధించిపెట్టగలవు...ఎందుకంటే మనమందరం 'విక్రయదారులం'...మనం జీవితంలో పొందే విజయం మనం ఎదుటి వారికి మనవి ఎంత బాగా 'అమ్ముతాం' అన్న దాని మీద ఆధారపడి ఉంది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good