ప్రాచీన కాలంలో అయినా ఆధునిక కాలంలో అయినా గణిత శాస్త్రానికి గల ప్రాముఖ్యం అమోఘం. పరచెన కాలంలో యజ్ఞవాటికల నిర్మాణంలోనూ, శ్రీ చక్రమును రూపొందించడంలోనూ అంకెలకు అద్బుత శక్తులున్నాయని, అంకెలలో ప్రక్రుఇ శక్తులను వసపరచుకోవచ్చుని తలచి భారతీయుల గణితానికి మిక్కిలి గౌరవాన్ని ప్రాముఖ్యాన్ని యిచ్చారని పెద్దలు అంటారు. గ్రహాల గమనాన్ని వాటి స్థితి గతులను తెలుసుకొనుటకు, ఖగోళశాస్త్రం అబివృద్ది పరచుటకు అంక గణితంను అభివృద్ధి పరచవలసిన ఆవశ్యకత ఏర్పడినది. ఆ కారణంగానే గణిత శాస్రం ఖగోళ శాస్త్రం ఒకదానినొకటి అనుసరించి త్వరితగతిని అభివృద్ధి సాగించాయి. అసమాన మేధా సంపత్తి కలిగిన ఆర్యభట్, భాస్కరాచార్య, వరాహ మిహిరుడు మొదలగు ఖగోళ గణిత శాస్త్రములోని నిస్టాతులనేక మంది భారతీయ గణిత శాస్త్రజ్ఞలే . ఆధునిక గణితశాస్త్రజ్ఞలలో పేర్కొన దగినవారు. శ్రీనివాస రామానుజన్ మరియు సూపర్ కంప్యూటర్ నే సవాలు చేసిన శాకుంతలాదేవి .ఖగోళ, గణిత శాస్త్రంలో నిష్టాతలైన పావులూరి మల్లన, వరాహమిహిరుడు మొ || లగు వారు ఖగోళ ణనలు తేలికగా చేయుటకు నవాంశగణితాన్ని రూపొందించారు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good