ప్రేమ ఒక అందమైన, అద్వితీయమైన, అద్భుతమైన అనుభవం.
మాతృప్రేమ, పితృప్రేమ, సోదరప్రేమ ఇలా అనేకమైన ప్రేమలు ప్రతి ఒక్కరి జీవితంలో సహజంగా లభించేవే. అవి మానవ జీవితానికి అవసరమైనవని చెప్పేందుకు ఎలాంటి సందేహంలేదు.
కానీ ఒక పురుషుడు, స్త్రీ మధ్య ఏర్పడే ప్రేమ, యవ్వనం నుంచి మరణం వరకు సాగే ప్రేమ, సృషఙ్టకి నాంది పలికే ప్రేమ, మిగిలిన అన్ని ప్రేమలకు ఆధారమయ్యే ప్రేమ అన్నింటికన్నా ప్రత్యేకమైనదని నా అభిప్రాయం. ముఖ్యంగా కొన్ని సంవత్సరాలు కలిసి చదువుకుని, ఒకరినొకరు అర్థం చేసుకుని, ప్రణయాన్ని వివాహం ద్వారా సార్థకపరచుకుని సాగించే ప్రయాణం అత్యుత్తమైనది.
ప్రేమ కుల మతాలకు, భాషా ప్రాంతాలకు అతీతమైనది.
ప్రేమించేందుకు నిజాయితీ కలిగిన ధైర్యం, ధైర్యంగా చెప్పగలిగే సత్యం, సత్యం కోసం చేసే త్యాగం, త్యాగంలో కూడా మరుగుపడని అనురాగం అనేవి నాలుగు స్తంభాలు. బలమైన ఈ నాలుగు స్తంభాలపై నిలబడిన ఒక ప్రేమ కథ ఇది.
నిజమైన ప్రేమకు నిర్వచనం ఈ నవల. జీవితంలో వాస్తవిక దృక్పథం, ఆత్మాభిమానం, మంచిని పెంచే పట్టుదల, ఎన్ని కష్టాలు ఎదురైనా సడలని వ్యక్తిత్వంతో నిజాయితీగా, ధైర్యంగా ఉంటే అదే కష్టాల మెడలు వంచి మనకు విజయం చేకూరుస్తుందని చెప్పేదే ఈ నవల. అంతే కాదు ఈ రోజుల్లో మన దేశంలోని సాంఘిక సమస్యలపై కూడా కొరడా ఝళిపించి, మార్గదర్శం చేయిస్తుంది. కేవలం కాలక్షేపం కాదు, మీకు ఎన్నో కొత్త విషయాలు, విద్య, వైద్య, పారిశ్రామిక పురోగతి లాంటి వాటిపై ఒక కొత్త కోణంలో ఆలోచింపచేస్తుంది.
పేజీలు : 192