'జ్ఞాపకాలు' శీర్షిక కింద గొరుసు జగదీశ్వరరెడ్డి చేసిన కొన్ని ఇంటర్వ్యూ కథనాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. సమాచార సేకరణ ఇంటర్వ్యూ రూపంలోనే జరుగుతుంది. తరువాత దాన్ని ఉత్తమపురుష కథనంగా మారుస్తారు. 

ఎవరెవరిని ఇంటర్వ్యూ చేయాలనేది ఒక దశ. వారితో మాట్లాడడం ఒక దశ. రచన మూడో దశ. ఒకటి అభిరుచిని బట్టి, రెండోది చాతుర్యాన్ని బట్టి, మూడోది నైపుణ్యాన్ని, అనుభవాన్ని బట్టి ఉంటాయి.

ఇంటర్వ్యూ చేయబడ్డ ప్రతి ఒక్కరూ వాళ్ల వాళ్ల రంగాల్లో తీవ్రమయిన అభినివేశం ఉన్నవారు. మనుషుల్లో ఉండే అన్ని పాత్రలనూ పోషించాను కాబట్టి, ఇక నాకు మరుజన్మే ఉండదు - అని ఒక రంగస్థల నటుడు అంటాడు. అది 

అతిశయం కాదు, ఆత్మగౌరవం కూడా. ప్రతి ఒక్కరికీ తమ కళాత్మక జీవితంపై ఎంతో సంతృప్తి ఉన్నది.

పేజీలు : 224

Write a review

Note: HTML is not translated!
Bad           Good