అందమైన ప్రకృతిని చూసి ఎంత నెమరు వేసుకున్నా తనివి తీరదు. ప్రకృతిని చూసి ఆస్వాదించే మనసుండాలే కాని, ఏ కోణంలో చూసినా అందాలే. పశుపక్ష్యాదులు, పచ్చని చెట్లు, గలగల పారే సెలయేళ్లు, సొగసైన పువ్వులు. గాలికి రెపరెపలాడే ఆకులు, వయ్యారంగా తలలూపే కొమ్మలు. ఆకాశంలో విరబూసే రంగుల హరివిల్లు. ప్రకృతిని స్ఫూర్తిగా తీసుకుంటే మనెంతో శాస్త్రవిజ్ఞానం తెలియవస్తుంది. ఎగిరే పక్షిని చూసి మానవుడు విమానం తయారు చేశాడు. నీటిలో ఎంతో అలవోకగా ఈదే చేప, పడవ తయారీకి మూలమైంది. పశుపక్ష్యాదులను చూసి నేర్చుకున్నది మనిషే అయినా ప్రేరణ, స్ఫూర్తి నిచ్చింది పశుపక్ష్యాదులే. మనకు తెలిసిన శాస్త్ర సంగతులు విశ్వంలో ఉన్న ప్రాణులు ఏనాడో నేర్చాయి. వాటి జీవన విధానాన్ని, అవి ప్రకటించే విశేషాల లోతుల్ని తెలుసుకోవాలన్న ప్రయత్నాలు సాగుతున్నంత వరకు, మన విజ్ఞానశాస్త్ర పరిధి విస్తృతమవుతూనే ఉంటుంది. ప్రకృతిలో సంభవించే సృష్టి వైపరీత్యాలను ముందే పసికట్టగల అద్భుత ప్రాణులు ఈ విశ్వంలో ఉన్నాయి. నిన్నటి సునామి నుండి ఎన్నో జంతువులు తమ ప్రాణాల్ని కాపాడుకోగలిగాయి. ప్రకృతి నిశితపరిశీలన ద్వారా ఎన్నో శాస్త్ర సంగతులు తెలియవస్తాయి. నీటిపైన కొన్ని జీవాలు సునాయాసంగా నడిచిపోతూ ఉంటాయి. ఈ నడక వాటికెలా సాధ్యమైంది. వీటిని విశ్లేషిస్తే జీవద్రవ గతిక శాస్త్రాల మధ్య గల సంబంధాన్ని తెలుసుకోవచ్చు. ఏ దిశా, కాలం తెలియకుండానే వేల కిలోమీటర్ల దూరం పక్షులు వలస పోతూ ఉంటాయి. ఏ శాస్త్రమాధారంగా అవి తిరిగి తమ ప్రాంతాలకు చేరుకుంటూ ఉంటాయి. పశుపక్ష్యాదులు వాతావరణ విషయంలో ఎన్నో వివరాలను తమదైన శైలిలో మనకు చెబుతున్నాయి. ప్రకృతిలో విభిన్న రకాల పశుపక్ష్యాదులు వింతచేష్టలు, కదలికల వల్ల వాతావరణ విజ్ఞానం మనకు తెలియవస్తోంది. ప్రకృతిలో కనిపించే ప్రతి దృశ్యం ఓ ప్రశ్నను లేవదీస్తుంది. దాని సమాధానంలో ఎంతో శాస్త్ర వివరణ, విజ్ఞానం దాగి ఉంటుంది. వినీలాకాశంలో ఎంతో ఎత్తున విహరించే గద్దలు, రాబందులు నేలపై సంచరించే ఎలుకనో, కోడిపిల్లనో గుర్తించగలవు. ఇంతటి నివిత దృష్టి వీటికెలా కలిగింది? ఆ కంటి నిర్మాణంలో ప్రత్యేకత ఏమిటి? నూరుటన్నుల బరువున్న నీటి తిమింగలం నీటిలో మునిగిపోకుండా ఏవిధంగా తేలాడుతుంది. కొన్ని చేపలు సముద్రం నుండి ఎనిమిది మీటర్లకు పైగా ఎగిరి పక్షిని సులువుగా పట్టుకొని నీటిలోనికి పోతాయి. గ్లైడర్‌లా సంచరించే నైపుణ్యం ఆ చేపకు ఎలా కలిగింది. అవనిలో కాలుష్యం వల్ల అంతరించే అందాల్ని పసిగట్టగల మొక్క (లైకెన్స్‌) లున్నాయి. అసహ్యపు రూపు నిండి అందాల బొమ్మగా ప్రత్యక్షమయ్యే సీతాకోకచిలుక అందాలు విరించి కుంచె నుండి జాలువారిన అందాలకు నిదర్శనం ఈ రంగులు ఆ కీటకానికెలా వచ్చాయి. సమాచార రంగంలో పశుపక్ష్యాదులు మనకంటే ఎంతో ముందున్నాయి.......

Pages : 129

Write a review

Note: HTML is not translated!
Bad           Good