Rs.150.00
Price in reward points: 125
Out Of Stock
-
+
ఋషి మాసపత్రిక ద్వారానూ, ఈటివి2 సుఖీభవ ద్వారానూ ఎందరికో ఆరోగ్యాన్ని అందిస్తున్న డాక్టర్ గాయత్రీదేవి రచించిన ఆయుర్వేద గ్రంథం.
నిత్య జీవితంలో భాగం కావలసిన ఆయుర్వేద ఆరోగ్య సూత్రాలు, ఆరోగ్యరక్షణ మార్గాలూ, దురలవాట్లని దూరంగా ఉంచే మార్గాలూ, రోజూ తినే ఆహారపు వివరాలూ, పోషక విలువలు, ఔషధ మూలికల ప్రయోజనాలూ, ప్రయోగాలు, సామాన్యంగా ఎక్కువ మందిని బాధించే ఆరోగ్య సమస్యలకి ఆయుర్వేదం అందించిన పరిష్కారాలూ అందిస్తుంది.
డాక్టర్ల దగ్గరికి పరిగెత్త అవసరాన్ని తగ్గిస్తుంది.
ఆత్మీయంగా మీతో మాట్లాడుతుంది. మీ సందేహాలు వింటుంది. సమాధానం చెబుతుంది. ప్రతిరోజూ ఒక్క అంశం గురించి చదవండి. చదివి జీర్ణించుకోండి, జీర్ణించుకుని మీ సమస్యలని మీరే పరిష్కరించుకోండి.
ప్రకృతివరాలు - సమీక్షలు
గృహవైద్యం మీద చాలా పుస్తకాలు వచ్చాయి. అయితే ప్రకృతి వరాలు అనే ఈ పుస్తకం ఈ విషయంలో శాస్త్రీయమూ, సమగ్రమూ అని చెప్పవచ్చు. ఆయుర్వేద పట్టభద్రురాలే కాక జాతీయ స్ధాయి బహుమతులు పొందిన సాహితీవేత్త గాయత్రీదేవి చేతిలో పడటం వల్ల ఈ గ్రంథానికి మరిన్ని అందాలు చేకూరాయి.
ఆరోగ్య సమస్యలకు ప్రకృతిలో లభించే సులభోపాయాల సూచిక ఎవరికయినా ఆమోదయోగ్యం కదా.
ఇది కొనుక్కుని ఓ రిఫరెన్స్ బుక్లా ఇంటి దగ్గర ఉంచుకుని ప్రయత్నించి ఫలితం పొందితే లాభమే... - ఇండియాటుడే
రోజూ తినే అన్నం, పప్పు దగ్గర్నుంచి, వంటింటి పోపుల పెట్టెలోనే అన్ని రకాల దినుసులనీ కలుపుకుని, సీజనల్గా లభించే రకరకాల ఫలాల దాకా వాటి మహత్తు గురించి తెలిస్తే ఒక్కొక్కటీ ఒక్కొక్క వైద్య గుళిక. ప్రకృతి అందించిన ఈ గుళికలను అన్నింటినీ ఒక దారంలో గుది గుచ్చి, ఏ సమస్యకు ఏ గుళిక ఎలా వాడాలనే విషయాలను జూనియర్ డాక్టర్ లా మనకందిస్తుంది. తరచూ మనం ఎదుర్కొనే అనేక ఆరోగ్య సమస్యల పరిష్కారాలకీ కరదీపిక ఈ పుస్తకం. రిఫరెన్స్ కోసం భద్రపరుచుకోదగిన పుస్తకం. - ఈనాడు