అలస్కా, క్లాన్ డైర్ జిల్లాలో 1896లో బంగారం ఉన్నట్లు కనుగొనబడింది. ప్రపంచం నలుమూలల నుంచి అనేకమంది బంగారం వేటలోపడ్డారు. వారిలో చాలా మంది చలి రాక్షసికి బలైపోయారు. బంగారం దొరికిన కొంతమంది శ్రీమంతులయ్యారు. బంగారం వేటలో జాక్లండన్ కూడా స్వయంగా పాల్గొనటం వల్లనే ఈ కథ ఇంత అద్భుతంగా చెప్పారు. అలాస్కా మంచులో ప్రయాణించటానికి స్లెడ్జి బల్లకు బలమైన కుక్కలను కట్టేవారు. అందువలన కుక్కలకు బాగా గిరాఖీ పెరిగింది. దానితోపాటు కుక్కల దొంగలు కూడా పెరిగారు. అలాంటి ఒక దొంగచే దొంగిలించబడుతుంది బక్ అనే కుక్క. ఆ బక్ కథే ఈ ప్రకృతి పిలుపు నవల. ఈ బక్ చేసే అసమాన పోరాటాలతో చూపే అసమాన తెగువతో పాటూ అలనాటి సమకాలీన పరిస్థితులను కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తుంది ఈ నవల. ప్రతివారూ తప్పకుండా చదవవలసిన పుస్తకం ఈ ప్రకృతి పిలుపు.
పేజీలు : 109