కామ్రేడ్ విమల మెల్లగా దేకుతూ ముందుకు కదిలింది. అట్లా కొద్దిదూరం దేకింతరువాత భూమికి చేతులానించి అతి కష్టంమీద లేచి నిలబడింది. వెంటనే శత్రువు పేల్చిన తుపాకీ గుండోకటి తన చెవులను గింగిర్లెత్తిస్తూ తలమీదుగా దూసుకువెళ్ళింది.
వెంటనే వంగోని రక్షణ తీసు కోవా అనుకుంది. కానీ, వంగడం ఆమెవల్ల కాలేదు. వంగితే పొత్తికడుపులోంచీ పోట్లు గుండెలోకి పొడుచుకొస్తున్నాయి. ఇంక చేసేదిలేక కామ్రేడ్ విమల చప్పన కిందకు పడిపోయింది.!
ఓ అమరులారా! వీరులారా! అక్కలారా! అన్నలారా! మీ అమరత్వం ఆకాశమంత ఉన్నతమైంది. నేనో? భూమికి ఐదదుగుల ఎత్తు కూడా ఎదగని సాధారణ మానవుణ్ణి! మీ అమరత్వాన్ని అక్షరాల్లో బంధించ సాహసించాను.
- జనార్ధన్ (ఆలూరి భుజంగ రావు)

Write a review

Note: HTML is not translated!
Bad           Good