సోవియట్‌ యూనియన్‌ పతనం తర్వాత ప్రపంచ సామ్రాజ్యవాదానికి ఏకైక ప్రతినిధిగా అమెరికా దూకుడుగా ఉరకలు వేస్తోంది. జాతీయ విముక్తి పోరాటాలతో సహా ప్రపంచ శ్రమజీవుల పోరాటాలకు సహజమిత్రుడిగా, నాయకుడిగా వుండిన సోషలిస్టు వ్యవస్థ ఓటమి పాలవటంతో, ప్రపంచ గుత్త పెట్టుబడిదారీ శక్తుల మొనగాడుగా అమెరికా మూడవ ప్రపంచదేవాలలో ఆర్థిక, రాజకీయ జోక్యానికి, పెత్తందారీతనానికీ బరితెగించింది. తనకెదురు లేదనే పొగరుతో సామ్రాజ్యవాదం విర్రవీగుతోంది. సాంస్కృతిక కథనాలను మార్కెట్‌ చేసుకుంటూ, వాటి ద్వారా సాంస్కృతిక సామ్రాజ్యవాదాన్ని వ్యాప్తిచేసి వెనుకబడిన దేశాల మనోప్రపంచాలపై క్షీణ విలువలు రుద్దుతోంది. ఆర్థిక భూమండలీకరణ అమలుకొరకు తన తిరుగులేని రాజకీయపెత్తనం చలాయిస్తూ, ఒకే మార్కెట్టు, ఒకే సంస్కృతి ఒకే విద్యామాధ్యమం అంటూ ప్రతిదానినీ సామ్రాజ్యవాదుల ప్రయోజనాల కొరకు నిర్మించుతోంది. తన ప్రయోజనాలే ప్రపంచ ప్రయోజనాలుగా చిత్రించుకోతంది. ఒకనాడు వెనుకబడిన దేశాలలో వ్యక్తయిన స్వాతంత్ర పోరాట స్ఫూర్తిని ఈ పరిస్థితి వమ్ము చేస్తోంది. భారతదేశంలాంటి వెనుకబడిన దేశాలలోని వివిధ జాతుల భాషలపై, సంస్కృతిపై కూడా ఈ దాడి కొనసాగుతోంది.

పేజీలు : 117

Write a review

Note: HTML is not translated!
Bad           Good