వేమనలా తెలుగు వారి గుండెలో పలికిన ప్రజాకవి మరొకరు అప్పటికి ఇప్పటికి కూడా లేరనే చెప్పాలి. నాలుగువందల ఏళ్లుగడిచినా మన నాలుకల మీద నాట్యమాడుతున్న ఆయన పద్యాలే అందుకు సాక్షి. తెలుగు భాషలో అవిభాజ్య భాగంగా అలరారే ఆయన పదాలూ పలుకుబడులే నిదర్శనం. మూఢత్వం జడత్వం హీనత్వం ఆధిపత్యం ఆడంబరం, అహంభావం, వంటి అవలక్షణాలను చీల్చి చెండాడిన వేమన పద్యాలు అనితర సాధ్యాలు. అయితే ఇంతటి చైతన్య స్ఫూర్తినిచ్చిన వేమన గురించి ఎన్నో అధ్యయనాలు జరిగినా అసంపూర్ణత వెంటాడుతూనే వచ్చింది. ఈ నేపథ్యంలో 45 ఏళ్ళ క్రితం నవవయవ్వనంలో ఎన్‌.గోపి వేమన తపస్సు ప్రారంభించారు. 1978లో పిహెచ్‌డి అందుకున్నారు.

            ఇప్పటికే ఆరు ముద్రణలు పొందిన 'ప్రజాకవి వేమన'ను మరోసారి పరిచయం చేసే సాహసం చేయబోవడం లేదు. ''సాధనమున పనులు సమకూరు ధరలోన'' అన్న వేమన వాక్కును గోపి ఈ రచనతో, శోదనతో నిజం చేశారన్నది విజ్ఞుల మాట. వేమన సర్వస్వం అభివర్ణనకు అన్నివిధాలా అర్హమైన అనర్ఘ రత్నం ఈ గ్రంథం. వేమనపై వెలువడిన పరిశోధనలు, రచనలు, సంకలనాలన్నింటి సారసంగ్రహం, సమగ్ర సందర్శనం. ఈ ఒక్క పుస్తకం చదివితే ప్రజాకవి వేమనపై సాధికారికంగా మాట్లాడటానికి అవసరమైన సాహసమేగాక, సంతృప్తి లభిస్తుందని ధృఢంగా చెప్పగలం.

పేజీలు : 407

Write a review

Note: HTML is not translated!
Bad           Good