ప్రజా కళలూ - ప్రగతివాదులూ - ఆరుద్ర
తెలుగు ప్రజల కళారూపాలు
ఆదిమ వర్గ రహిత సమాజాలలో కళలన్నీ కూటి పెంపుదల కోసం తోడ్పడే ప్రయోజనకమైన విద్యలే. వానరుని నుండి నరుడు పరిణమించాక, తన కాళ్ళపై తాను నిలబడ్డాక, ఆ కాళ్ళు నిలదొక్కుకొన్నాక, చెయ్యి తిరిగాక, గొంతు విడ్డాక, పనిముట్లు  చేసుకునే విద్య పట్టుబడ్డాక ఆదిమానవులు ప్రాథమిక కళలను సంఘ జీవితానికి (). శ్రమలోంచి శ్రమ కోసం కళలు పుట్టాయి.

ఒకరి ఉద్దేశాలను ఇంకొకరికి సైగలతో చెప్పుకొంటూ వేటాడే దశలో కలిసి కట్టుగా కూతలు పెట్టినా, కుప్పిగంతులు వేసినా, కూనిరాగాలు తీసినా, కూటపు చిందులు వేసినా, గుహ గోడలపై కొంకి బొమ్మలు గీసినా, ఏ మానవ వ్యాపారమైనా కూటి కోసమే జరిగేది. ఆదిమ సమాజంలో మానవులందరూ కలసి ఉన్నట్టే కళలన్నీ కూడా కలిసి ఉమ్మడిగా ఉండేవి. మొట్టమొదటి మోత (వాద్యం), కూత (శుష్క శబ్దాలు), ఆట నృత్యం మాత్రమే కలసి ఉండేవి. అప్పటిదశలో మానవజాతికి మాటలు పూర్తిగా లేవు.

మాటలొచ్చీ రాగానే పాటలు పుట్టాయి. మాటలు శ్రమలోంచి శ్రమకోసమే పుట్టినట్టు పాటలు కూడా పనికోసమే అవసరమయ్యాయి. ఏ పాటకైనా ఒక నడకా, తూగూ ఉంటాయి. శరీర కష్టం కావిస్తున్నప్పుడు కరచరణాల కదలికలకు అనుగుణంగానే లయ, రాగం నిర్ణయమవుతాయి. చేసే పనినిబట్టి ఛందస్సు వుంటుంది. పాటను ఏ ఒక్కడో రాయడు. గుంపులోని అందరూ దానిని అల్లుకుంటూ, పాడుకొంటూ పనిచేసుకొంటారు. పనిపాటలన్నీ కూటికోసమే. ఆట (నృత్యం), మోత (వాద్యం), పాట (గీతం) విడదీయరాని కళలయ్యాయి. ఈ మూడింటినీ ''క్షార్యత్రికం'' అని అంటారు. వీటితోపాటు గీత (ఆలేఖ్యం) అంటే రకరకాల రూపులు గీయడం కూడా ముఖ్యమైన కళగా తండాకంతటికీ తిండిపెట్టే విద్య అయ్యింది. కూటికోసం వేటాడే ఇతర విద్యలు కూడా అవసరమయ్యాయి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good