ప్రజలు తమ జీవిత పోరాటక్రమంలో సృష్టించుకున్న ఎన్నో సంపదల్లో కళలూ, సాహిత్యం ఒక భాగం. సమాజం అభివృద్ది చెందుతున్న కొద్దీ ఆయా దశల్లో సాహిత్యం, కళాలూ, ప్రజల అవసరాలమేరకు అనేక రకాలుగా అభివృద్ధి చెందుతూ వచ్చాయి. ముఖ్యంగా కళల విషయానికొస్తే అవి యీ క్రమంలో అనేక మార్పులకు లోనై ప్రజల భావాలను, వారి సుఖసంతోషాలను, ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తూ వచ్చాయి. ప్రజలు తమ పోరాట క్రమంలో సాధించుకున్న అమూల్యమైన సంపదలు కాబట్టే అవి ఆ ప్రజల హృదయాల్లో నిలిచిపోయాయి. వారి జీవితంలో భాగమైపోయాయి. అందుకే వాటిని ప్రజాజీవితం నుండి, వారి జీవన పోరాటాల నుండి విడదీసి చూడలేము. అలా ఎవరన్నా విడదీసి చూస్తున్నారంటే వారు ఖచ్చితంగా ప్రజావ్యతిరేకులే! ఆయా కళలను ప్రజా జీవితం నుండి విడదీసి చూపి వాటికి 'పవిత్రతను, మార్పులకు లోనుకాని, మార్పులు చేయరాని 'జడత్వాన్ని' ఆపాదించే వారి ప్రజావ్యతిరేక స్వభావాన్ని జాగ్రత్తగా గమనించాలి, అర్ధం చేసుకోవాలి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good