ఆంధ్రప్రదేశ్ ప్రజల ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండా రాష్ట్రాన్ని విభజించారు. రాజధాని లేదు. ఆర్థిక లోటు. ప్రధాన ఆదాయ వనరు హైదరాబాద్ నగరం కోల్పోవడంతో ఆదాయం కూడా తగ్గిపోయింది. సాంకేతికంగా, రవాణా పరంగా అభివృద్ధి చెందిన క్రమంలో ప్రపంచం చాలా చిన్నదైపోయింది. ఈ నేపథ్యంలో అత్యాధునిక సౌకర్యాలు, సకల హంగులతో నూతన రాజధాని నిర్మించుకోవడం ఓ ఛాలెంజ్. రోజు రోజుకి మారిపోయే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒడిసి పట్టుకోవడంలో, పరిపాలనానుభవంలో దిట్ట అయిన నారా చంద్రబాబు నాయుడు నూతన రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కావడం ఓ అదృష్టం. రాష్ట్రం నడిబొడ్డున, నది ఒడ్డున రాజధాని ప్రదేశం ఎంపికచేయడమే కాకుండా రైతులను నొప్పించకుండా ఒప్పించి 34 వేల ఎకరాలు సమీకరించడం ద్వారా ఆయన తొలి విజయం సాధించారు. రాజధాని నగరం అంటే నాలుగు భవనాలు, పరిపాలన ఒక్కటే కాదని పర్యాటక, ఉపాధి, విద్య, వైద్యంతోపాటు ఆర్థిక నగరంగా భాసిల్లాలన్నది చంద్రబాబు ఆకాంక్ష. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని ముందు చూపుతో 9 నగరాల సమూహంగా అంతర్జాతీయ స్తాయి ఆధునిక మహానగరంగా అమరావతిని తీర్చిదిద్దుతున్న రూపశిల్పి చంద్రబాబు....
పేజీలు : 128