విరసం, సాహిత్య, సాంస్కృతిక రంగాలలో వర్గ పోరాటాన్ని కొనసాగించే సంస్థ. భూస్వామ్య, బ్రాహ్మణీయ, సామ్రాజ్యవాద సంస్కృతికి ప్రత్యామ్నాయంగా ప్రజా సంస్కృతిని నిలబెట్టి ప్రచారం చేస్తుంది. ప్రజాకళలు, కళారూపాల ద్వారా విప్లవాన్ని ప్రచారం చేస్తుంది. వేల సంవత్సరాలుగా ప్రజలు రూపొందించుకొని, కొనసాగిస్తున్న ప్రజల కళలను సామ్రాజ్యవాద సంస్కృతి ధ్వంసం చేస్తున్న ఈ సందర్భంలో ప్రజాకళలను కాపాడుకోవాల్సిన అవసరం మరింత పెరిగింది.

పీకేఎం ప్రభాకర్‌ ఇరవై సంవత్సరాలుగా ప్రజాకళామండలి (పీకేఎం)లో క్రియాశీలకంగా పనిచేశాడు. కార్యకర్తగా, నాయకుడుగా ఆ సంస్థ విస్తతిలో భాగమయ్యాడు. ప్రభాకర్‌ డప్పు, డోలక్‌ను వాయించటంలో ప్రత్యేక నైపుణ్యం కల్గినవాడు. పీకేఎంలో చాలామంది కళాకారులకు ప్రజా కళారూపాలను నేర్పించటంలో అతడు టీచర్‌గా పనిచేసాడు. వివిధ ఆర్థిక, రాజకీయ సమస్యల మీద ప్రత్యేక గొంతుతో పాటలు పాడటం అతని ప్రత్యేకత.

ప్రభాకర్‌ కేవలం కళాకారుడు మాత్రమే కాదు, అతడొక రాజకీయ స్పష్టత ఉన్న రచయిత. ఏడు పాటలు, పదమూడు వ్యాసాలు వివిధ సందర్భాలలో రాసాడు. వీటిలో నాలుగు వ్యాసాలు ప్రజాకళల మీద, ఆ కళలను ప్రచారం చేసిన వ్యక్తుల మీద రాసాడు. పెట్టుబడిదారీ అత్యున్నత దశగా ఉన్న సామ్రాజ్యవాదం ప్రజల జీవితాలను ఎన్నిరూపాలలో ధ్వంసం చేస్తున్నదో ప్రభాకర్‌ తన వ్యాసాలలో చెప్పాడు. బహుముఖ ప్రజ్ఞ కలిగిన ప్రభాకర్‌ తన రాజకీయ కార్యాచరణను విస్తరిస్తూ విప్లవోద్యమంలోకి వెళ్లాడు. నవంబర్‌ 24న మల్కనగిరి-రాంగూడలో జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్‌లో అమరుడయ్యాడు. కళాకారుడుగా, రచయితగా అతని కృషిని ఈ సమాజానికి అందించవల్సిన బాధ్యత విరసంపై ఉంది. అందుకే 'ప్రజాకళలు' పేరుతో ప్రభాకర్‌ రచనలను పుస్తక రూపంలో తెచ్చాం. - విరసం

పేజీలు : 135

Write a review

Note: HTML is not translated!
Bad           Good