ప్రగతి కోసం సైన్స్‌ అంటే ఎవ్వరికీ పేచీ ఉండదు.  ఉండకూడదు కూడా.  కానీ ఏ రకమైన ప్రగతి?  ఎవరికోసం ప్రగతి?  అనే ప్రశ్నలు వెంటనే పుట్టుకొస్తాయి.  సరియైన సమాధానాలు కావాలంటే సైన్స్‌ సంబంధిత అవగాహన పెరగాలి.  చర్చ జరగాలి.  అసలే అక్షరాస్యత తక్కువగా ఉన్న మనదేశంలో సైన్స్‌కు సంబంధించిన అవగాహన కావాల్సినంత రీతిలో పెరగలేదు.  ఇక సైంటిఫిక్‌ అక్షరాస్యత గురించి ఏమి చెప్పాలి?  పత్రికల్లో కూడా దీన్ని గూర్చి చాలా తక్కువగానే రాస్తున్నారు.  పూర్తిగా విస్మరించారనలేముగానీ రాజకీయాలకే ఎక్కువగా పెద్దపీట వేస్తున్నారు.
''గత యాభైకోట్ల సంవత్సరాలలో ఐదుసార్లు వినాశనాలు జరిగాయి.  తొలి నాలుగు వాతావరణంలో వచ్చిన పెనుమార్పులు కారణంగా జరుగగా, ఐదోది గొప్ప ఉల్కాపాతం కారణంగా సంభవించింది.  ఈ ఐదో వినాశనంలోనే డైనోసార్లు అంతరించాయని భావన.  ఇక ఆరవ వినాశనం ప్రస్తుతం సాగుతోంది.  సూత్రధారి మనిషి, పాత్రధారి నాగరికత!''.
ఇంకో మెట్టు పైకి వెళ్ళి పర్యావరణాన్ని, మనిషి బాధ్యతను పరిశీలిస్తూ చెప్పిన మాటలు మనం గుర్తుపెట్టుకోకపోతే తప్పు మనదవుతుంది. - ప్రొ.  సి.సుబ్బారావు, మాజీ చైర్మన్‌, ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యామండలి.
సైన్సు, టెక్నాలజీ రంగాలు ఎవరికోసం, ఎలా పనిచేయాలి; ఈ రంగాలతో మిగతారంగాల యెడల సంబంధాలు ఏమిటి; ప్రజలకివి ఎలా దోహదపడాలి - అనే విషయాలకు వీరి విశ్లేషణలు చాలా ఆసక్తికరమేకాదు; అత్యంత అవసరమైనవి కూడా!  అందుకే 'ప్రగతికి ప్రస్థానం - సైన్సు' అని అంటున్నాం.  - రచయిత డాక్టర్‌ నాగసూరి వేణుగోపాల్‌

Write a review

Note: HTML is not translated!
Bad           Good