చరిత్ర ఒక శాస్త్రం. ఈ శాస్త్రం ప్రజలు ఎలా జీవించారు, వారి కృషి ద్వారా ప్రపంచం ఎలా మారింది, వాళ్ళ జీవితం ఎందుకు, ఎలా మారి, యీనాటి జీవితంలోకి పరిణామం చెందింది అన్న విషయాలను పరిశీలిస్తుంది. ఎన్నోవేల సంవత్సరాల క్రితం జీవించిన ప్రజల జీవితం గురించి మనం ఎలా తెలుసుకోగలం? మానవులు భూమిమీద గుర్తులను విడువకుండా అంతరించిపోరు. వాటినే అవశేషాలు లేక పురావశేషాలు అంటారు. ఈ అవశేషాలను అధ్యయనం చేయ్యడం ద్వారా విజ్ఞానశాస్త్రవేత్తలు ప్రాచీన మానవులు ఎలా జీవించారో తెలుసుకుంటారు.

ప్రాచీన ప్రపంచ చరిత్రను సమగ్రంగా అందించే అపూరూప పుస్తకం నిడమర్తి ఉమారాజేశ్వర రావు, రాచమల్లు రామచంద్రారెడ్డిలు అనువదించిన 'ప్రాచీన ప్రపంచ చరిత్ర'. ఈ గ్రంధ అనువాదానికి మూలం ఎఫ్‌.కొరోవ్కిన్‌. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good