ప్రాచీన భారత సమాజంలో  బానిసల స్థితిగతులు - వాల్టెర్‌ రూబెన్‌ - అను : ఉప్పల లక్ష్మణరావు
ప్రాచీన భారతదేశంలో బానిస వ్యవస్థ ఉండేదా: ఉంటే గ్రీక్‌ రోమన్‌ బానిస వ్యవస్థ లాంటిదా, వేరైనదా? ఈ సమస్యలు చాలాకాలంగా భారత చరిత్రకారులను వేధిస్తున్నాయి.
ఈ అంశంపై తుది నిర్ణయం జరిగిందని చెప్పలేము, నిజానికి ఇలాంటి సమస్యలపై తుది నిర్ణయం అంటూ ఉండబోదు. ఎప్పుడూ కొత్త సమాచారం లభిస్తూ కొత్త పార్శ్వాలను తెరుస్తూ ఉంటుంది. కాని - మౌలికా అవగాహన ఒకటి ఇప్పటికి ఏర్పడ్డది. కనీసం మార్కి ్సస్టు చరిత్రకారులకు సంబంధించినంత వరకూ ఇది వర్తిస్తుంది.
హరప్ప, మొహంజదారో నాగరికత కాలం క్రీ.పూ. 2500 - 3000 ల మధ్య. ఆ కాలానికే బానిస, బానిస యజమాని వ్యవస్థ ఉండేదని నిర్దిష్టమైన ఆధారాలు లభించాయి. ఈజిప్టు, బాబిలోనియన్‌ దేశాల బానిస వ్యవస్థకు, దీనికి పోలికలున్నాయి, వర్ణవ్యవస్థ ఆనాటికి లేదు.
కౌటిల్యుని అర్ధశాస్త్రంలో తిరిగి బానిస వ్యవస్థను గురించి, అసంఖ్యాకమైన ఉల్లేఖనలు, వివరణలూ ఉన్నాయి. శూద్రులు బానిసలు కారు. వారు కర్షకులు, ఆర్యులని ఖచ్చితమైన స్పష్టీకరణ ఉంది. కౌటిల్యుని కాలం క్రీ.పూ. 300.
ఈ రెండు సరిహద్దుల మధ్య భారతీయ సమాజ పరిణామంలో బానిస వ్యవస్థ వర్ణ విభజన పక్కపక్కగా సాగాయి. సుమారు 2 వేల సంవత్సరాలకు పైబడిన ఈ కాల వ్యవధి చరిత్రకారులకు పరిశోధనా రంగంగా ఉంది.
ఈ గ్రంథ రచయిత రూబెన్‌ ప్రముఖ జర్మన్‌ ఇండాలజిస్టు. మార్కి ్సస్టు పరిశోధకులలో అగ్రశ్రేణికి చెందినవారు. పెక్కుమంది భారతీయ మార్కి ్సస్టు పరిశోధకులకు మార్గదర్శకులు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good