Rs.150.00
In Stock
-
+
సద్దాం హుస్సేన్ కొరకరాని కొయ్యగా ఉన్నాడని అతనిని తొలగించేందుకు, అతని వద్ద ప్రమాదకరమైన రసాయన ఆయుధాలున్నాయనే మిషతో 2003లో ఇరాక్‌పై దాడి జరిపి సద్దాం హుస్సేన్ అధికారం నుండి తొలగించి ఉరితీయించింది. కాని ఎంత వెతికినా ఎటువంటి మారణాయుధాలు దొరకలేదు. కాని అమెరికా చేసిన ఘాతుకాన్ని ఖండించే నాధుడే లేకుండా పోయాడు. అదే విధంగా తన మాట వినని లిబియాపై దాడి జరిపి 2011లో గడాఫీని అధికారాన్నుండి తొలగించి, అతనిని అతని కుమారులను కూడా అతి దారుణంగా చంపింది అమెరికా శిబిరం. అలాగే అమెరికా ప్రకటించిన రోగ్ దేశాలైన సిరియాలో అస్సాద్‌ను గద్దె దింపటానికి అమెరికా శిబిరం శాయశక్తులా ప్రయత్నిస్తున్నది. దీని తర్వాత ఇరాన్ సంగతి చూస్తామని కూడా అమెరికా ప్రకటించింది. ఆ విధంగా ఏకధ్రువ ప్రపంచంలో అమెరికా ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రచ్ఛన్న యుద్ధం తీవ్రంగా ఉన్న 1978 నుండి అంతమైన 1991 వరకూ, ప్రధానం వివిధ అంతర్జాతీయ అంశాలపై వివిధ దినపత్రికలు, మాసపత్రికలలో ప్రచురించబడిన 420 వ్యాసాల నుండి, 60 మాత్రమే ఎంపికజేసి పాఠకుల ముందుంచారు. ప్రపంచ పరిణామాలను సులభశైలిలో వివరించిన మంచి పుస్తకం.