'వందేమాతరం' జాతీయోద్యమానికి, జాతీయగీతాలకు తొలిమెట్టు. భారతజాతికి మేల్కొలుపు అనదగిన గీతాన్ని రచించిన జాతీయ కవిబ్రహ్మ బంకించంద్ర చటర్జీ, తరువాత 'జనగణమణ' గీతం వర్తమాన జాతీయగీతం, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ రచించారు. ఎందరో తెలుగుకవులు కూడా స్వాతంత్య్ర ఉద్యమంలో పాలుపంచుకొని, జైళ్ళపాలయి, తెలుగుజాతిని ఉత్తేజపరుస్తూ అనేక చైతన్యగీతాలను వెలువరించారు. ఆ స్ఫూర్తితో స్వాతంత్య్రానంతరం కూడా ఎందరో కవులు అనేక ప్రబోధ గీతాలు వివిధ సందర్భాలలో రచించారు.

దేశమును ప్రేమించుమన్న,

మంచి అన్నది పెంచుమన్నా - మహాకవి గురజాడ


ఏ దేశమేగినా యెందుకాలిడిన,

ఏ పీఠమెక్కిన, ఎవ్వరేమనిన

పొగడరా నీ తల్లి భూమిభారతిని,

నిలుపరా నీ జాతి నిండుగౌరవము - రాయప్రోలు సుబ్బారావు


వందనమిదిగైకొనుమీ! భారతజననీ!

భారతజననీ! మా పాలిపటి రాణీ! - గరిమెళ్ళ


మేలుకొనుమీ! భరతపుత్రుడ!

మేలుకొనుమీ! సచ్చరిత్రుడ!

మేలుకొనవయా! వత్సా మేలుకో! - మంగిపూడి

ప్రజాశక్తిని ప్రజ్వలింపజేసి, కర్తవ్యతాప్రబోధము చేసి, కులమతాలకతీతంగా దేశభక్తితో జాతిని సమైక్యపరచి, ఒక్కత్రాటి మీద నడిపించటానికి ఇలాంటి ప్రబోధగీతాలు తరతరాల వారు సదా స్మరించదగినవి.

పేజీలు : 44

Write a review

Note: HTML is not translated!
Bad           Good