బ్రాహ్మణ వేషధారులైన పాండవులు తమ తల్లియగు కుంతీ దేవితో ఏకచక్ర పురమున నున్నప్పుడే, పాంచాలదేశ ప్రభువైన ద్రుపద మహారాజు తన కూతురగు ద్రౌపదికి స్వయంవరమును జరుపుచుండెనను వార్తను వినిరి. ఏకచక్రపురములోని విప్రులు కొందరు ఆ వివాహమునకు వెళ్ళి అచ్చట జరిగే వినోదములు వేడుకలు కన్నార చూచి, ద్రుపదునిచే భూరి సంభావన లొంది, వివాహ భోజనం చేసి రావలెనని కుతూహల పడిరి.

పాండవులకు పాంచాల రాజధానికి వెళ్ళి వీలైతే ద్రౌపదిని గెలుచుకుని రావలెననే కోరిక కలిగింది: కుంతి వారి కోరికను పసిగట్టి, ''యుధిష్టిరా! మన మీ పట్టణములో ఉండబట్టి చాల కాలమైంది. మరియొక పురమునకు వెళ్ళడం మంచిది. ఇక్కడి ప్రకృతి దృశ్యాల నన్నింటిని చూచి వెగటు కలిగింది. పురిలోని సద్గృహస్థులు ప్రతిదినము భిక్షనిస్తున్నారు కదా యని ఎంతకాలమైన వారికి భారంగా ఇందుండం సబబుకాదు. ద్రుపదరాజు పరిపాలించు పట్టణము వైభవోపేతంగా, ధన ధాన్య సమృద్ధి కలిగి ఉన్నదని వింటున్నాము. మనము వెంటనే అక్కడికి వెళ్ళడం బాగని నా తలంపు'' అని ఆ అన్నదమ్ములకు అనుకూలంగా సలహా ఇచ్చింది.

మనసులో ఉన్న కోర్కెను తల్లితో చెప్పేందుకు జంకి లోలోన సతమతమౌతూ ఉండిన పాండవుల సమస్యను వివేకవతియైన పాండురాజపత్ని సులభముగ తీర్చివేసింది.

ఏకచక్రపురము నుండి బయలుదేరి పోతూ ఉన్న బ్రాహ్మణుల గుంపుతో చేరి తాము కూడ ద్రుపదపురికి పయనమైనారు పాండవులు తల్లితో. కొన్నాళ్ళ తరువాత అందరు కాంపిల్యనగరం చేరినారు. పాండుపుత్రులు తల్లితోగూడ తమ బ్రాహ్మణ వేషాలు వదలకుండ, అజ్ఞాతంగా ఉండగోరి, ఒక కుమ్మరివాని ఇంట బస చేసినారు.

పేజీలు :152

Write a review

Note: HTML is not translated!
Bad           Good