గుండ్రని బల్లచుట్టూ నాల్గు కుర్చీలు - అందులో ఒక దానిలో శేషాచలం. మిగిలిన మూడింటిమీద శారద, వసంత, భానుమూర్తి. శేషాచలాని కా ముగ్గురు వరుసగా పుట్టిన బిడ్డలు. శారద వయసు పండ్రెండేండ్లు. ఆమె చాల బుద్ధి సూక్ష్మత కలది. భానుమూర్తి బలే చురుకైన అబ్బాయి. వసంత ఈ ఇద్దరికి మద్యరకం. ''నాన్నా, ఈ వేళ మాకేదో మంచి కథ చెబుతామన్నారే? మరచిపోయారా? '' అని హెచ్చరించింది శారద.

''లేదమ్మా జ్ఞాపకముంది.''

''ఏమికథ, నాన్నా, నీవు చెప్పేది? క్రొత్తగా 'చందమామ'లో చూచావా?'' అని అమాయకంగా ప్రశ్నించాడు కొడుకు.

''చందమామలోని కథ కాదురా నే చెప్పేది. పూర్వపు కవులు వ్రాసిన ప్రబంధాల్లోని కథలు చెబుతా, వినండి?''

''అవేమంత బాగుంటాయి, నాన్నా? ప్రబంధ కథలన్నీ కల్పిత కథలని నీవే ఒకనాడన్నావుగా?'' అన్నది శారద.

''కథలన్నీ కల్పితాలేనమ్మా, పోతే ఇప్పటివారి కథలు చాలా మట్టుకు సాంఘీక విషయాలను గురించి చర్చిస్తే, పూర్వపు కవులు దేశ చరిత్రలను, పుణ్యతీర్ధాలు, క్షేత్రాలు, పుణ్యపాపాలు మొదలైన నీతిబోధకాలను కథల రూపంగా వ్రాసేవారు. అంతేకాక, అప్పటివారి ఊహాశక్తి, వర్ణనాశక్తి ఇప్పటివారిలో చాలా తక్కువ. కాబట్టి అప్పటి సంగతులు తెలిసికొనేందుకు మీరు పూర్వకవులు వ్రాసిన గ్రంథాలను కూడా చదవాలి. అయితే, అవన్నీ చాలమట్టుకు క్లిష్టమైన శైలిలో వ్రాయబడిన పద్యప్రబంధాలు. వాటిని చదివి అర్ధం చేసుకోవాలంటే ఎక్కువ భాషాజ్ఞానం, పాండిత్యం కావాలి. అందువల్ల మీకు వానిని సులభమైన వాడుకభాషలో చెబుతా వింటారా?''.

పిల్లలు ముగ్గురు ఏకగ్రీవంగా అరిచారు'' వింటాం, నాన్నా!'' అయితే, నీ విప్పుడు చెప్పబోయే కథ ఏది? అనింది వసంత. ''దానిపేరు పాండురంగ మహాత్మ్యము. దానిన రచించిన కవి పేరు తెనాలి రామకృష్ణ కవి. అతడు పూర్వము శ్రీకృష్నదేవరాయల కాలములో అతని సభయందు అష్టదిగ్గజములలో ఒకడై యుండెను.'' ''సరే, నాన్నా, కథ ప్రారంభించు'' అని శారద కథను వినాలనే కుతూహలాన్ని ప్రదర్శించింది. అలాగే ...వినండీ

Write a review

Note: HTML is not translated!
Bad           Good