మనుచరిత్ర ఆరు అశ్వాసముల ప్రబంధము, చతుర్దశ వర్ణనలతో అలరారుతున్న ఈ ప్రబంధ రత్నమును రచించినాడు అల్లసాని పెద్దనామాత్యుడు. దీనికి, ప్రధానంగా గ్రంథకర్త స్వారోచిష మనుసంభవమని నామకరణం చేశాడు. అయినప్పటికీ, కవి ఒక చోట దీనిని మనుచరిత్రమను పేరుతో పేర్కొన్నాడు. ఆ పేరే లోకంలో ప్రఖ్యాతి పొందింది. స్వారోచిషమనువు జన్మ వృత్తాంతం మార్కండేయ పురాణం లోనిది. ఈ పురాణాన్ని మారన ఆంధ్రీకరించాడు. అందలి కథనే ఆధారంగా తీసుకొని పెద్దన్న, కొలది మార్పులతో ఈ ప్రబంధ రచన కావించాడు.

మను చరిత్రలో పెద్దన శిల్పం అపూర్వమైనది. అతను తన సర్వతోముఖ పాండిత్యమును ఈ గ్రంథమున పొదిగి చూపాడు. కల్పనలు కూర్చడంలోను, కథా సంవిధానంలోను ఇతడు అసమానమైన ప్రజ్ఞను ప్రదర్శించాడు. ముద్దులు మూటకట్టే పెద్దన పద్దెములలో వ్యర్థ పద ప్రయోగమెక్కడా కనిపించదు. అతుకులతుకులుగా ముడి పెట్టిననట్లుండే సన్నివేశములు వెదికి చూచినా దొరకవు. మధురాతిమధురమైన మనుచరిత్ర 'అల్లసానివారి అల్లిక జిగిబిగి' అను పలుకులను సర్వత్రా సార్ధకం చేస్తున్నది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good