కవి అనగానే కాళిదాసు జ్ఞాపకం వస్తాడు ఎవరికైనా. అవును, కవి అంటే అతనే. కవిత్వం అంటే అతనిదే. కవిత్వం అంటే రుచి మరిగేటట్లు చేసినవాడు అతనే. అందుచేతనే కవికుల గురువు కాళిదాసు. అతని కవితాశోభను గురించి ఎవరు వర్ణించి చెప్పగలరు? ఆ పని చేయడంలో కొంతలో కొంత కోలాచల మల్లినాథ సూరికి చెల్లింది.

కాళిదాసు కుమారసంభవం, రఘువంశం, మేఘసందేశం అను కావ్యాలూ, మాళవికాగ్నిమిత్రం, విక్రమోర్వశీయం, అభిజ్ఞాన శాకుంతలం అను నాటకాలూ, ఋతు సంహారం అను చిన్న కావ్యం రచించాడు. ఇతను ఒక ఛందోగ్రంథం, కొన్ని జ్యోతిష గ్రంథాలు కూడా రచించాడని కొందర చెబుతారు. కుమార సంభవానికి మూలం శివ, అగ్ని, లింగాది పురాణాలు. అయితే అడవిలోని పుష్పరసానికీ, గిన్నెలోని తేనెకూ ఎలాంటి భేదమో ఈ పురాణాదులకూ, కుమార సంభవానికి గల భేదం అలాంటిదే!

చమత్కారమూ, ధ్వనీ, రసపుష్టిగల ఘట్టాలు ఈ కావ్యంలో పెక్కులున్నాయి. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good