ప్రాచీనార్య వాజ్ఞయంలో వేద శాస్త్రాల తర్వాత చెప్పవలసినవి పురాణాలు. పద్మం మొదలైన ఈ పురాణాలు అష్టాదశ పురాణాలుగా ప్రఖ్యాతి వహించాయి. నాల్గులక్షల గ్రంథ సంఖ్య గలవి. ఈ పురాణాల నుంచే ఉపపురాణాలు పుట్టాయి. వీటిలో పదకొండవది స్కాందపురాణం. ఇది ఎన్నో సంహితలతో, ఎన్నో ఖండాలతో అతివిచిత్ర కథలతో ఏకలక్ష గ్రంథ పరిమాణం కలది. ఇక్కడ గ్రంథం అంటే ముఫ్పైరెండు అక్షరాలు గల శ్లోకం అని అర్థం చెప్పుకోవాలి. కాబట్టి లక్ష గ్రంథం అంటే లక్ష అనుష్టుప్పులు (32 అక్షరాలు గల శ్లోకాలు) కలిగిందన్న మాట. ఆ మహాస్కాందం పురాణ సారాంశమనీ ధర్మమూ, అర్థమూ, కామమూ, మోక్షమూ అనే నాలుగు పురుషార్ధాలకూ మూలమనీ, బ్రహ్మ విద్యకు అది కారణమనీ అన్ని ఖండాలలోనూ ప్రఖ్యాతి  కలిగింది. దానికి గల గొప్పతనం మరి ఏ పురాణానికీ లేదు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good