భీమఖండం
నైమిశారణ్యంలో ఒకప్పుడు పన్నెండు సంవత్సరాలపాటు ఒక మహాయజ్ఞం జరిగింది. ఆ యజ్ఞం జరుగుతూ ఉండగా ఒకప్పుడు రోమహర్షణ పుత్రుడూ, వ్యాసమహర్షి శిష్యుడూ, అయిన సూతముని వచ్చాడు. అప్పుడు కులపతి అయిన శౌనకుడూ మొదలైన పరమమునులు ఆయనను అర్చించి ఆయన వల్ల ఏభై ఖండాలు కలిగి, ఎన్నో సంహితలతో కూడుఉకొని, నూటపాతిక వేల శ్లోకాల గ్రంథమైన స్కాందపురాణం వింటూ అందులో పూర్వ ఖండంలో వేదవ్యాసుడు తన అపరాధం వల్ల విశ్వేశ్వరుని కోపానికి గురి అయి, కాశీ విడిచి బయలుదేరినట్లు విని అటు తర్వాత జరిగిందేమో వినాలని వేడుకపడి ఇలా అడిగారు. '2అయ్యా! సూతమునీ! కాశీనగరం విడిచిపెట్టిన పిదప వ్యాసమహర్షి శిష్యులతో గూడా ఎక్కడికి వెళ్ళాడు?  ఏ తీర్ధంతో స్నానం చేశాడు? ఏం చేశాడు? మాకు సెలవియ్య వలసింది.''

Write a review

Note: HTML is not translated!
Bad           Good