Rs.175.00
In Stock
-
+
ప్రాచీన భారతదేశ చరిత్రను అధ్యయనం చేయటానికి అనేక కారణాలున్నాయి. మనదేశంలో అత్యంత ప్రాచీనమైన సంస్కృతుల్ని ఎవరు, ఎలా, ఎప్పుడు, ఎక్కడ అభివృద్ధి చేశారో ఆ అధ్యయనం మనకు చెబుతుంది. వారి జీవితాలకు స్థిరత్వాన్నీ, భద్రతనూ ఇచ్చిన వ్యవసాయాన్ని వారు ఎలా ప్రారంభించారో అది సూచిస్తుంది. ప్రాచీన భారతీయులు ప్రకృతి వనరుల్ని ఎలా కనుగొన్నారో, వాటిని తమ అవసరాలకు ఎలా ఉపయోగించుకున్నారో, నిత్యావసరవస్తువుల్ని ఎలా సమకూర్చుకున్నారో చూపుతుంది. వ్యవసాయం, నూలు వడకటం, బట్టలు నేయటం మొదలైన వృత్తుల్ని వారు ఎలా నేర్చుకున్నారో ప్రాచీన చరిత్రను అధ్యయనం చేయటంద్వారా మనం తెలుసుకోవచ్చు. పల్లెల్నీ, పట్టణాలనీ, చివరగా పెద్ద రాజ్యాలనీ వారు ఎలా స్థాపించారో కూడా మనం అర్థం చేసుకోవచ్చు....