అణువంత వాక్యంలో బ్రహ్మాండం అంత జ్ఞాన బోధని ఇమిడ్చి మహాత్ములు అనేక ఆథ్యాత్మిక సత్యాలు వివిధ సందర్బాల్లో చెప్పారు. భగవాన్‌ శ్రీ రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస లాంటి ప్రసిద్ధులే కాక తెలుగు వారికి పెద్దగా పరిచయం లేని ఇతర మహాత్ములు చెప్పిన, వివిధ భాషల నించి మల్లాది వెంకట కృష్ణమూర్తి సేకరించిన సూక్తుల సంకలనమే ఈ 'ప్ర-వచనం'.

తక్కువ సమయంలో చదవగలిగే వీటిని రోజుకి కొన్ని చొప్పున చదవచ్చు. ప్రయాణాల్లో, తీర్థయాత్రల్లో, పర్వ దినాల్లో కూడా స్వాధ్యాయంగా చదవచ్చు.

నచ్చిన ఏ ఒక్క సూక్తిని అనుసరిచినా, మనసుకి పట్టిన ఏ ఒక్క సూక్తి ప్రకారం జీవించినా అది ఆథ్యాత్మిక ప్రగతికి తప్పక దోహదం చేస్తుంది.

Pages : 128

Write a review

Note: HTML is not translated!
Bad           Good