బ్రిటీష్‌వారి హయాంలో గాంధీ, టాగూర్‌, నెహ్రూ వంటి ప్రముఖులు ఉద్భవించారు. కాని స్వాతంత్య్రానంతరం విఖ్యాతి గాంచిన లలితకళాకారులెవరూ తయారు కాలేదు. అందుకు కారణం, నేటి పాలక వ్యవస్తే. దేశంలో నేడు విడుదలవుతున్న సాహిత్యం నేటి మన జనతను, ముఖ్యంగా యువతను పతనావస్థకు దిగజార్చుతోంది. అమెరికానుండి దిగుమతవుతున్న సెక్స్‌, డిటెక్టివ్‌ సాహిత్యం చెదపురుగులా యువతరాన్ని కలుషితం చేస్తోంది. ఈ దుస్థితిని తొలగించాలంటే - సృజనాత్మక రచనలు కావాలి. అవి ప్రోత్సహింపబడాలి. అందుకు ఆర్థిక స్వాత్తంర్యం అవసరం. గతంలో ప్రజానాట్యమండలి ద్వారా మంచి నాటకాలు, కళాఖండాలు, గ్రంథాలు అత్యుత్తమ స్థాయిలో ప్రజోద్యమం నుండి వెల్వడినాయి. సృజనాత్మకమైన రచనలు, కళాఖండాలు సాగాలంటే, రావాలంటే ఒక విప్లవోద్యమం అవసరం. అలాంటి విప్లవోద్యమం ఆర్థిక స్వాతంత్య్రాల కోసం మీ యువజనత బలీయమైన యువజనోద్యమాన్ని నిర్మించి, విప్లవం వైపు ముందుకు సాగి, దేశ భవిష్యత్తును కొత్త మలుపుకు మరలిస్తారని ఆశిస్తున్నాను.

పేజీలు : 39

Write a review

Note: HTML is not translated!
Bad           Good