మా భూమి', 'వీర కుంకుమ', 'గెరిల్లా' నాటకాల కోవకు చెందినదే 'పోతుగడ్డ' నాటకం కూడా. సంఘటనలు జరిగిన గ్రామం తెలంగాణాకు చెందినదిగా నాటి ప్రేక్షకులు అర్ధం చేసుకోవటానికి అవకాశం వుండేట్లుగా ఈ నాటకం నడుస్తుంది. నాటకం నడిచిన గ్రామం ఏ తాలూకాలోదో, జిల్లాలోదో స్పష్టంకాకుండా, సాధారణీకరించిన కథనం యిది.

అది 1948-49ల నాటి విముక్తి ప్రాంతంలోని ఒక తెలంగాణా గ్రామం అనుకోవచ్చు. పరిమితమైన అర్ధంలోనే యిక్కడ విముక్తి అనే పదాన్ని వాడాము. నాటి తెలంగాణాలో 3000 గ్రామాల్లో ఇలాంటి గ్రామరాజ్యాలు వెలిశాయి.
****
శ్రీ భాస్కరరావుగారు ఈ నాటకంలో గ్రామీణ ప్రజల జీవితాన్ని కళ్ళకు కట్టినట్లు చిత్రించారు. ఆంద్ర ప్రజలీనాటకాన్ని అభిమానించి ఆదరించుతారని ఆశించుతున్నాం.
-ప్రచురణకర్తలు

Write a review

Note: HTML is not translated!
Bad           Good