శ్రీ పోతులూరి వీరబ్రహంగారి రచనగా కాలజ్ఞానం మాత్రమే లోకంలో ప్రసిద్ధి చెందివుంది. భవిష్యత్తులో సంభవించే ఎన్నో విషయాలు - ముందుగానే ఆయన తన కాలజ్ఞానం ద్వారా తెలియజేసారనే నమ్మకం ప్రజల మధ్య ఉండడమే ఆ ప్రసిద్ధికి కారణం. ఎక్కడ ఏ వింత జరిగినా, విడ్డూరం కనిపించినా వెంటనే అక్కడ ఉదాహరింపబడే పేరు వీరబ్రహ్మంగారిదే. ''వీరబ్రహ్మంగారి పేరు తెలియని ఆంధ్రుడు ఉండడు'' - అంటే అతిశయోక్తి కాదు. ఎన్నో ఏళ్ళ క్రిందట ఆయన చెప్పిన విషయాలు తరువాత కాలంలో అక్షరాలా జరుగుతున్నవనే విస్తృత ప్రచారంతో పాటు ఆయన అవతార పురుషుడు, దైవాంశ సంభూతుడనే ప్రగాఢమైన విశ్వాసం, భక్తిభావం, జనులలో పాదుకొని ఉన్నాయి.. నిజానికి భవిష్యత్తును దర్శించగలిగిన మహానుభావులుగా వీరబ్రహ్మం గారి ప్రఖ్యాతి ఆంధ్రదేశంలో ఎంతో ప్రశస్తమైనది. ఈ కాలజ్ఞానం - ఆంధ్రదేశంలో ప్రజల నాల్కలపై తత్త్వాల రూపంలోను, వచనరూపంలోను అల్లుకుపోయి ప్రసిద్ధి కెక్కివుంది....

పేజీలు : 247

Write a review

Note: HTML is not translated!
Bad           Good