మన కామ్రేడ్స్‌ మనందరికీ ఆదర్శప్రాయలు. వాళ్లు కామ్రేడ్‌ మావో చెప్పిన 'ఫైట్‌ ఎగనెస్ట్‌ సెల్ఫ్‌' సూత్రానికి అనుగుణంగా స్వార్థం శీరస్సును అనేకసార్లు గండ్రగొడ్డలితో నరికారు. తుదిశ్వాస విడిచే వరకూ ఆ కర్తవ్య నిర్వహణలో ఏమాత్రం ఏమరుపాటుగా లేరు. ముఖ్యంగా స్వార్థానికి పునాదిగా ఉన్న ఈ దోపిడీవర్గ సమాజాన్ని ధ్వంసం చేసేందుకు 'సాయుధ వర్గ పోరాట' ఆయుధాన్ని చివరిక్షణం వరకు వదలలేదు. వాళ్లు సర్వస్వం ప్రజల కోసమే అంకితమయ్యారు. అందుకే వాళ్లు మన రోజువారి జీవితంలో, ఆలోచనల్లో, పనుల్లో మార్గదర్శకులుగా ఉండాలి. మనం వాళ్ల విప్లవ జీవితాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసికెళ్లాలి. అలా చేయడం ప్రస్తుత సామాజిక విప్లవానికీ భవిష్యత్‌ సమాజ నిర్మాణానికీ ఎంతో అవసరం. ఆ కామ్రేడ్స్‌ మనకు అందించిన స్ఫూర్తితో దేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేసి, సోషలిజం గుండా కమ్యూనిజం చేరేందుకు మీరందరు మీ వంతు కృషి చేస్తారని ఆశిస్తూ.

పేజీలు :106

Write a review

Note: HTML is not translated!
Bad           Good