తెలుగులో ప్రపంచప్రసిద్ద తత్వవేత్తలను రేఖా మాత్రంగా పరిచయం చేసిన మొట్టమొదటి తెలుగు రచయిత గోపీచంద్‌. ఎందరో ప్రాఛ్య పాశ్చాత్య తత్వశాస్త్రవేత్తలను, భావవాదులను, భౌతికవాదులను అధ్యయనం చేసిన గోపీచంద్‌, ఈ రెండు వాదనల్లోను నేటి ప్రపంచానికి అవసరమైన అనుసరణీయమైన అంశాలు. కొన్ని సవరించుకోవలసిన అంశాలు ఉన్నాయని, వీటిని సమన్వయపరచడం నేటి చింతనాపరుల కర్తవ్యమని తన ఆలోచనలతో తెలుగు పాఠకులపై గాఢ ముద్ర వేసిన రచన ఈ 'పోస్టు చెయ్యని ఉత్తరాలు'.

ఒక్కొక్క సిద్ధాంతానికి ఒక్కొక్క పరిస్ధితిలో ప్రాముఖ్యత వస్తుందని వాస్తవాన్ని గోపీచంద్‌ గ్రహించారనడానికి ఈ పుస్తకంలో ఆయన వెలువరించిన ఆలోచన సరళి నిలువెత్తు నిదర్శనం. భౌతికవాది అయిన రచయిత ఆధ్యాత్మికతలోని లోతుపాతులను అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించడం ద్వారా సంపూర్ణ మానవుడయ్యారు. సంస్కరణల సంధి యుగంలో తాత్త్విక గందరగోళంలో పడిన పాతతరం మేధావులు ఈ పుస్తకం చదవడం ద్వారా కొంత సాంత్వన పొందవచ్చు. జిజ్ఞాసువులను అలరించే పుస్తకం. - వార్త 

Write a review

Note: HTML is not translated!
Bad           Good