ఈ పుస్తకం మీకు చెప్పే విషయాలు :-
ప్రభుత్వ ఆసుపత్రులు సిఫార్సు చేసిన రోజువారీ పోషకపదార్థాలు శరీరంలోని ప్రకృతిసిద్ధమైన రక్షణకవచం వ్యాధులబారినుండి రక్షించటానికి తగినంత శక్తిని ఎందుకు కలగజేయటం లేదు? మనం వాటిని తీసుకోవలసిన మోతాదు ఏమిటి?
మీ శరీరంలోని ఆక్సిజన్ విచ్ఛిన్నం చెందటం మీకు ఎలాంటి ఉపద్రవం కలిగిస్తోంది? ఆ నష్టాన్ని పూడ్చటానికి మీరేం చేయాలి?
తరచూ వచ్చే అలర్జీలను, సైనస్ ఇన్ఫెక్షన్లనూ ఎలా ఎదుర్కుంటారు?
మీ డాక్టర్లిచ్చే మందులు క్షీణింపజేసే మీ దీర్ఘకాలిక వ్యాధులకు అత్యుత్తమ రక్షణను ఎందుకు కలుగజేయటం లేదు?
సుప్రసిద్ధ వైద్యవిజ్ఞాన పత్రికలలోని 1,300కి పైగా చికిత్సా అధ్యయనాలని విస్తృతంగా పరిశోధించి పరిజ్ఞానాన్ని గ్రహించాక, డా|| స్ట్రేండ్, వయోవృద్ధి వేగాన్ని తగ్గించి, ఎంతో విధ్వంసాన్ని సృష్టించే వ్యాధుల నించి తిరిగి కోలుకునేందుకు సాయపడటంలో ముఖ్యమైన పాత్ర నిర్వహించే పోషక ఔషధాల గురించి విశదీకరించాడు. ఆ ప్రమాదకరమైన విధ్వంసాన్ని కలగజేసే వ్యాధులు - మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బులు, దీర్ఘకాలిక అలసట, మల్టిపుల్ స్ల్కెరోసిస్ తదితరమైన అనేక వ్యాధులు.