కథా నవల బాల సాహిత్య రచయితగా పేరొందిన సత్యనారాయణగారు తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో జన్మించారు. పి.యు.సి. వరకు చదివి, ఆంధ్రా యూనివర్శిటీలో చిరకాలం పనిచేసి, ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌గా పదవీ విరమణ చేసి విశాఖలోనే స్థిరపడ్డారు.

300 వరకు సాంఘిక కథలు, 70 వరకు అపరాధక పరిశోధక కథలు, 12 వరకు అపరాధ పరిశోధక పొట్టి నవలలు, 5 ధారావాహిక నవలలు, అనువాద నవలలు రచించారు. వీరి రచనలు ఆంధ్రప్రభ, ఆంధ్ర సచిత్రవారపత్రిక, అపరాద పరిశోధన, విజయ మొ|| పత్రికలలో వీరి రచనలు ప్రచురించబడ్డాయి.

బాల సాహిత్యంలో 400 కథలు చందమామ, బుజ్జాయి, బొమ్మరిల్లు, బాల భారతం, బాలభారతి, ఆంధ్రప్రభ మొ|| పత్రికలలో ప్రచురించబడ్డాయి.

శ్రీలక్ష్మి మాసపుత్రిక, శ్రీవాణి పలుకు బాలల పత్రికలకు సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు.

వివిధ బాలల పత్రికలలో ప్రచురించబడిన 15 కథలతో వెలువడిన కథా సంపుటి ఈ ''పోరు నష్టం''.

పేజీలు : 48

Write a review

Note: HTML is not translated!
Bad           Good