మర్మమైన అగంతకుడొకడు ముదుసలికి, పుట్టి ఒకరోజు మాత్రమే అయిన మేకపిల్లను బహుమతిగా ఇచ్చి వెళ్ళిఓతాడు. అతి చిన్నదైన ఆ నల్లని మేకపిల్ల, పూనాచ్చి సున్నిత్త్వం, దాని బహుసంతాన సామర్థ్యం చుట్టూ ఉన్నవారి ఆశ్చర్యానికి కారణమవుతుంది. తన్నుకు పోవాలని చూసిన గద్ద మొదలు, ఎత్తుకు పోవాలని చూసిన అడవిపిల్లి దాకా, ర్పమాదాల నుంచి పూనాచ్చిని కాపాడుకోవడం ముసలివాడికీ, అతని భార్యకీ పోరాటంగా మారుతుంది. పూనాచ్చి ఆ వృద్ధ దంపతుల చిన్న ప్రపంచానికి కేంద్రంగా మారిపోతుంది.

రైతులు, పశువుల కాపర్లు, మేకలు... ఎవరికీ కూడా బతుకును కొనసాగించడం సులభతరం కాదు. కురవని వర్షాలు, బలులు కోరుకునే దేవుళ్ళు, ఆదమరచిన ప్రాణుల్ని కబళించడానికి అవకాశం కోసం ఎదురుచూస్తున్న అడవులు. వీటన్నింటి మధ్యా తనను ఒక వైపు గాయపరుస్తూ, మరోవైపు కంటికి రెప్పలా కాపాడుకుంటున్న మనుష్యులను పూనాచ్చి పరికిస్తూ, నిశ్చబ్దంగా ప్రశ్నిస్తూ ఉంటుంది.

సున్నితమైన అదే సమయం సంక్లిష్టమైన జంతు ప్రపంచానికి చెందిన కథ ఇది. మనం జీవిస్తున్న కాలం గురించిన వ్యాఖ్యానం కూడా. వర్గ, వర్ణ అసమానత్వాలు, ఆధిపత్యపు దాడులు నిండిన సమాజంలో, అసమర్థ రాజకీయ వ్యవస్థకు తలొగ్గకుండా, ప్రశ్నిస్తున్న మనుషులు ఎదుర్కొంటున్న దౌర్భల్యాన్ని చిత్రీకరించే కథ ఇది.

పేజీలు : 133

Write a review

Note: HTML is not translated!
Bad           Good