పొలిమేర సరిహద్దుకు పర్యాయపదం. గ్రామాల పొలిమేరలు - గ్రామాల్లోని ర్పజల జీవన సరళిని తెలియజేస్తుంటాయి. ఇవి ఆయా గ్రామ ప్రజల విభిన్నతనూ, చిరకాలంగా వారి నడుమ కొనసాగుతున్న కులాల ఆధిక్య అధమ వ్యత్యాసాలను అతి సహజంగా చూపెడుతుంటాయి. ఇంకా చెప్పాలంటే - గ్రామంలోని ఒక వర్గం జనాన్ని తతిమ్మావారి నుంచి దూరంగా అట్టిపెడుతున్న ఒక సంప్రదాయాన్ని, సామాజిక రీతిని కళ్లకు కడుతూ ఉంటాయి.

దళిత సమస్య మూలాలు వేలాది సంవత్సరాలుగా వర్ధిల్లుతున్న హైందవ వ్యవస్థలో ఉన్నాయి. ఆ సమస్య గురించిన స్పృహ, చైతన్యం చెప్పుకోదగ్గ రీతిలో గత వందా నూట ఏభై క్రితమే అన్ని వర్గాలలోనూ కలిగింది. సమస్యకు సంపూర్ణ పరిష్కారం సంస్కరణలూ, సముదాయింపులు ఇవ్వలేవని నాకు తెలుసు. కంచికచర్ల, చుండూరు, కారంచేడు లాంటి సంఘటనలను ఎదుర్కోడానికి పోరాట మార్గమే సరియైనది అని కూడా తెలుసు. కానీ వద్యాధిక దళిత యువకులూ ఉన్నతాధికారులూ తమ తమ మార్గాలలో దళిత జాతిని జాగృతం చెయ్యడానికున్న అవకాశం, అవసరం గురించి కూడా చెప్పడం, నా అనుభవాలను అందరికీ అందించడం ఎంతో అవసరం అని నమ్మి ఈ 'పొలిమేర' రాశాను. - నంబూరి పరిపూర్ణ

పేజీలు : 205

Write a review

Note: HTML is not translated!
Bad           Good