Buy Telugu Poetry Books Online at Lowest Prices. Books writen by poets like Sri Sri, Devarakonda Balagangadhar Thilak, Arudra, Atreya, Jashuva and many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Maro Golaniki

మిత్రుడు ఉప్పల అప్పలరాజు ఇరవై ఏళ్ళకు పైగా తెలుసును. కేవలం వ్యక్తికాదు. అతని కవిత్వమూ తెలుసును, కావ్య వ్యక్తీకరణా తెలుసును. తొలి కావ్యానికి నేనే ముందు మాటలు రాసినట్లు గుర్తు. ఆనాటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అప్పల రాజు నిరంతరం కృషిచేస్తూ కవితాభివ్యక్తిలో బాగా రాటు తేలాడు ఈ ప్రయాణంలో సాధించినవి వివేచనా..

Rs.50.00

Chemata Chittadi Nel..

జీవితం పత్తిచేలో దిష్టిబొమ్మై నన్ను భయపెడుతోంది. రక్తాన్ని తనఖాపెట్టి చల్లిన మందుల్లో హృదయం గిడసబారి తాటాకు తెగుల్తొ నిలువునా ఎండిపోయింది. రేపటి కోసం కన్న కల పింజలు పింజలుగా గాల్లో తేలిపోతోంది. సాలు సాలుకు మళ్ళించిన చెమట కాలవలకు నిఖార్సయిన వెల చెప్పడానికి మల్ల గుల్లాలు పడుతున్నారు. దారప్పోగులతో చే..

Rs.20.00

Udyamame Oopiriga

కొన్ని దశాబ్ధాలు నా కళ్ళముందు కరిగిపోయాయి. కనీసం ఒక అర్థశతాబ్ధాన్ని అతి సమీపంగా పరిశీలించే అవకాశం నాకు లభించింది. ప్రజా రాజకీయాలే ఎంతో అమూల్యమయిన ఈ అవకాశాన్ని నాకు ప్రసాదించాయి. ప్రజలే నిజమయిన చరిత్ర నిర్మాతలనే వాస్తవాన్ని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. నిరంతరం ప్రజల మధ్య జీవిస్తూ, ప్రజల స..

Rs.100.00

Smiloo Gnapakaloo

జీవితాన్ని ప్రేమిస్తూ సకల పార్శ్వాలనూ దర్శించే ప్రతిభ, అద్వితీయ రచనలు, సభలూ సమావేశాలు, సరసగోష్ఠులు, విశ్వ విహారాలు తనవితీరా నవ్వుకోడాలు అన్నీ....మౌనముద్ర దాల్చిన వేళ..... తను ఓ మంచి లెన్స్‌ మన్‌ తన కళ్ళ కామెరా కందినవన్నీ మిత్రులతో పంచుకునేవాడు నిత్యం జరిగే కల్లోలాలకు గాఢంగా స్ప..

Rs.100.00

Mo Saaramsam

మో' కవిత్వమంతా సగటు వ్యక్తి ఆత్మిక ప్రపంచపు సంక్షోభానికి వ్యక్తీకరణ. సంక్షోభం ఫలితంగా వ్యక్తి గురయ్యే వేదనకు అక్షరరూపం. అస్తిత్వ ఆందోళనలో వున్న వ్యక్తి అస్థిరతకు స్థిర రూపం. యాంత్రిక ప్రపంచంలో నిర్లిప్తంగా మిగిలిన వ్యక్తి అర్థరాహిత్యపు అస్తిత్వాన్ని గురించిన ఆక్రందనల ఆవిష్కరణ 'మో' సారాంశం. 'మో' ..

Rs.150.00

Kavitha 2013

జీవితమంత విస్తారమైంది కవిత్వం. వర్తమాన కాలంలో జీవితానికి అద్దం పడుతూ, వ్యాఖ్యానిస్తూ, గతాగతాల్ని తడుతూ కవిత్వం తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నది. మిగతా ప్రక్రియలకన్నా వేగంగా అది సామాజిక చలనాలకు స్పందింస్తున్నది. సామాజిక చరిత్రకారుడు గణాంక కోణంలో మానవ జీవితాన్ని రికార్డు చేస్తుంటే, కవి సాంస్కృతిక కో..

Rs.120.00

Kavitha 2012

సృజనశీలికి 'కల్లోల కడలిలో అలల కవాతు' కనబడుతుంది. 'ఎండ కూడా పండు వెన్నెలే' అవుతుంది. పాట 'ప్రాణప్రవాహ'మవుతుంది. 'విరబూసే కలలకు అలసట' లేదని ఒక ప్రాకృతిక భావుకురాలు భావిస్తే, 'విత్తనాలవుతున్న మనుషుల్ని, మనుషులవుతున్న విత్తనాల్ని' ఒక విప్లవ సృజనకారుడు గుర్తిస్తాడు. కలం యోధుడిలో 'ఉద్యమ నెలరేడు'ను కనుగొ..

Rs.120.00

Kavitha 2011

ఇప్పుడే రాయడం మొదలెట్టిన కవికైనా, ఇప్పటికే దశాబ్దాల రచనా ప్రయాణం చేసిన కవికైనా, స్వీయ సమీక్ష అవసరమే. తాను ఆవిష్కరించదలచుకున్న దృశ్యానికీ లేదా ఆలోచనకూ, ఆవిష్కరించిన శబ్దరూపమిచ్చే అర్ధానికీ నడుమ అన్వయముందా అని చూసుకోవడం అత్యవసరమే. దిద్దుబాట్లు ఆవశ్యకమే. రచి తరచి చూసుకుంటే చేయాల్సిన మార్పులేంటో తెలుస..

Rs.120.00

Kavitha 2010

బడి ఈడు పిల్లలందరూ బడిలో లేనట్లుగానే కవిత్వ ఈడు పిల్లలందరూ కేవలం కవిత్వంలోనే లేరు వాళ్ళ స్ధలాలు వేరు, కాలాలు వేరు ఆశ లేదు...ఆస్కారం లేదు ఫలానారోజు కవిత్వం అంతమవుతుందనే హామీ కూడా లేదు 1910కి 2010కి వందేళ్ళ దూరం ఈ ఏడాది హేలీ తోకచుక్క కనపడకుండానే ఎన్న..

Rs.100.00

Kavitha 2009

ఒక సామాజిక సందర్భమో, సంఘటనో కవితావస్తువుగా వుండి తీరాలని ఏమీలేదు. బాహ్య ప్రపంచం ఎంత ముఖ్యమో అంతర్లోకం అంతే ముఖ్యం. చాలా సందర్భాల్లో రెంటినీ విడదీయలేం కూడా. కవితాప్రకంపనాలు ఏ కోణంనుంచైనా రావచ్చు. కవితల్ని సంకలనం కోసం పరిశీలించేటప్పుడు ఈ అంశాన్ని ప్రాతిపదికగా పెట్టుకుని తీసుకున్నాం. అనేక దర్శనాలను అ..

Rs.100.00

Kavitha 2008

భాషంటే కేవలం ఒక భావానికి మాధ్యమమేనా? ఒక నోటినుంచి మరొక చెవికి, ఒక కలం నుంచి మరొక కంటికి అక్షరాలను అందించే ఆధారమేనా? కాదనుకుంటా. ఒక జాతి ఉనికి నుంచి, మనికి నుంచి వ్యక్తికందిన జీవసంపదను ఇతరులకు పంచే పళ్లెం కూడా. సంస్కృతికి ఆకారం భాష, ఆకారం భాష. ఏదో ఒక ఆవేశంలో, ఒక ప్రత్యేకసందర్భంలో మహాకవి అ..

Rs.100.00

Kavitha 2007

నాకు తెలుసు నాకు తెలుసు నాకు ఖననముండదని, చావుని బతుకుతో సమానం చేసేవాడిని సమాధి చేయడం చాలా కష్టం చావులోనూ బతుకులోనూ బతికే వాణ్ణి సమాధి చేయటం మరీకష్టం నాకు తెలుసు నాకు ఖననముండదని - దానిలాస్టోయిలోవా, బల్గేరియా కవి..

Rs.80.00

Kavitha 2006

మనిషిలోని ఆర్తినీ, మానవ సంబంధాల మద్య సజీవంగా వుండవలసిన ఆర్ద్రతని కళా, సాహిత్యాలు మాత్రమే కంటికి రెప్పలా కాపాడగలవన్నది సాహితీమిత్రుల అచంచల విశ్వాసం. కళలు, సాహిత్యాలను పరిరక్షించుకోవటంతోపాటు అవి మరింతగా, ఫలవంతమయ్యే వాతావరణం సృష్టించడం కోసం ప్రయత్నించటం మనుషులుగా మన అందరి కర్తవ్యం, బాధ్యతా. ..

Rs.80.00

Kavitha 2005

సూటిగా చెప్పడంలో, అందంగా చెప్పడంలో ఎంత సొగసుంటుందో, ఎంత మర్మముంటుందో కవితాత్మకంగా చెప్పడంలో అంతకు మించినర మార్మికత ఉంటుంది. వర్ణవిన్యాసంలోని అనంత వర్ణ విన్యాసాలను అక్షర బద్దం చేసిన కవిమిత్రుల కవితల కదంబం 'కవిత-2005'. వేసవివేళ, వడగాడ్పులొక వంక, మల్లెల గుబాళింపు మరొకవంక. గత సంవత్సరంలో పత్రికలలో..

Rs.75.00

Kavitha 2004

ప్రతి సంవత్సరం తెలుగులో వచ్చే కవితల్లో మేలైనవి ఏరి ఒక పుస్తకంగా పదిలపరిస్తే ఇటు మంచి కవిత్వాన్ని, అటు సామాజిక చలనాన్ని నమోదు చేయవచ్చు. ఏడాదిలో వేల కవితలు వెలువడుతున్న సందర్భంలో ఒక ప్రాతినిధ్య సంకలనం రూపొందించడం చాలా చాలా కష్టమైన పని. ..

Rs.80.00

Jagte Raho

పదపదమంటూ పదాల పడవల మీద పోరాటానికి బయలుదేరిన సాహసికుడితడు ఈ బల్‌ రైఫిల్‌ పదాల స్వరాలలోంచి గుండెలను అమాంతం పేల్చగలడు అన్నింటినీ నిట్టనిలువునా పట్టపగలే కూల్చగలడు అతనొక ఆకాశనీలిమ, అరుణిమలతో ఆవేదనలని, అశ్రువులను ఆసాంతం హరించేందు శివమెత్తిన సాగరం. ఆయన కవిత్వం విప్..

Rs.100.00

Insha Allah

కరువొచ్చిన కాలంలో అరవై నిండాయి నాకు అతి తేలికగా, చొరబడి మారగలన ఇన్షా అల్లాహ్‌! బంధన సంబంధాల్లో అంధుల వలె తచ్చాడుతు అల్లాడడమే బంధువులని చివరివరకు ఇందధమిదె మన బతుకుకు ఇన్షా అల్లాహ్‌!..

Rs.20.00

Hasya Kavitalu

ఈ హాస్య కవితల బీరువా తీస్తే చాలు మనందరి ముఖాలతీరు ఎలుగెత్తు నవ్వుల తేరు కదలాడే చక్రాలపై కటకటలడోలు పలికించు అన్నవరపు జట్కాల బోలు మీ లీలలివే జాజా! జేగురుదొరా! చలేజా లెలెమ్మనే తరువోజ శాసనాల్నీమ్రోల, రా చూడష్టావక్ర వీరా సుడోజాగ్రద్ధీరా! ఈ చెమక్కు నానో వింటే పులినాన..

Rs.50.00

Gandhakuti

నా లోపల ఒక సముద్రం వుందని తెలుసుకానీ అందులో ఇన్ని జలస్తంబాలూ, అనేకానేక తుఫానుల్లో మునిగిపోయిన ఇన్ని మహా నౌకలు, నౌకల్లో ఇన్ని అక్షౌహిణుల సైన్యమూ, లక్షలాది ఈటెలు, కరవాలాలూ, అసంఖ్యాక శిరస్త్రాణాలూ, లోహ కవచాలూ, ద్రవమై వున్నాయని ఇప్పుడే, ఆరుపదుల అనుభవాల అణువిస్ఫోటన జరిగినప్పుడే తెలిసింది ప్రియతమా! ఈ లో..

Rs.75.00

Alvida

కౌముది కవిత్వం వెతికిపట్టి ఇవాళ ఒకచోట పెట్టి చూపిస్తున్న మిత్రుల కృషి విలువైంది. ఆ కవిత్వమంతా వరసగా ఇవాళ చదువుతూంటే - పాతగా పొగలాగ, అనిపించదు. ఆ వాక్యాలకు, పద సంపుటికి, పాతదనం లేదు. పునరుక్తి కాదు. కవిత్వ రహస్యమెరిగిన వ్యక్తి పడే జాగ్రత్త అది. మరీ ముఖ్యంగా 'ఏకాంత', 'ఒక వృక్షం', 'ఇంతకూ నేనెవర్..

Rs.100.00