తమ జాతియతను ప్రశ్నార్ధకం చేస్తూ పాకిస్తాన్‌ వెళ్ళమంటూ కూస్తున్న గాడ్సే వారసుల అకృత్యాలను వెల్లడిచేసిందీ పుస్తకం. ఒక ముస్లిం ముస్లింగా బతకాలంటే ప్రాణాలు అరచేత పట్టుకొని బతికే దీనస్థితిని కల్పించినచోట ఏడ్పునుసైతం రాతిముక్కలుగా మార్చి కాషాయ కోటలపై కసిగా విసరాలంటాడు రసూల్‌ ఖాన్‌ అందుకే తెలుగు సాహిత్యంలో అవార్డుల కోసమో, రివార్డుల కోసమో, దొంగమాటలు మాట్లాడ్తూ, ఏ రోటికాపాట పాడుతూ ముస్లింగా చెప్పుకోవడానికి కూడా భయపడే దళారి కవికాదు రసూల్‌ ఖాన్‌. తను నమ్మిందే రాస్తాడు అతని లక్ష్యం చైతన్యం అతని పరమార్ధం జనశ్రేయస్సు అందుకే ఈ 'మూలవాసి' యుద్ధసైరన్‌ మోగిస్తున్నాడు.

కలేజాఉన్నోళ్లకు స్వాగతం

కదంతొక్కే వాళ్ళకు స్వాగతం

- షేక్‌ కరీముల్లా

పేజీలు : 88

Write a review

Note: HTML is not translated!
Bad           Good