చౌడప్ప, సూరకవులవలె ఈ కవి సమకాలిక సాంఘిక దురాచారములను, దుర్జనుల చిత్త వృత్తిని, విప్రుల దురాచారములను, నిశితముగా విమర్శించాడు. అల్పులు బాహ్యాడంబరముచే నిక్కుచున్నారని బ్రాహ్మణులు కులవిద్య వీడి పాశ్చాత్య వేషభాషలను అనుసరించి వారి నాగరికతపై ఆసక్తి వహిస్తున్నారని, ధనికులు వేశ్యాలోలురై ఉన్నారని, వ్యక్తులలో దానగుణము అంతరించిందని, కులకాంతలు బ్రష్టులవుతున్నారనేటువంటి పరిస్థితులను అధిక్షేపశతక కర్తలు కలియుగ ధర్మములుగా చిత్రించారు. గువ్వలచెన్నడు కూడా అలాంటి భావములనే ఇక్కడ వ్యక్తీకరించాడు. విపులాంబర వాద్యంబులు రాజ లాంఛనములైనను అవి గంగిరెద్దుకు కట్టిన వస్త్రములేనని బాహ్య వేషముల వలన వ్యక్తికి గౌరవస్థానము ఏర్పడదని కవి బోదించిన అంశము పూర్వశతక ముల కనుకరణమే. నీతి, ధర్మము, న్యాయము తెలియని వారికి రాజ్యాధికార మొసగిన వారు నిర్వహించలేరని పరిపాలనాదక్షత లేని సమకాలిక ప్రభువులను దృష్టిలో ఉంచుకొని గువ్వలచెన్నడు వారిని అధిక్షేపించి ద్విజుల పతనావస్థను చిత్రించి వారి స్థితిగతులను నిశితంగా హేళన చేశాడు. విప్రులు మద్య మాంసాదులకు అలవడి, వివిధ వృత్తులను స్వీకరిస్తున్నారని పాశ్చాత్య వేషమును అనుకరించి నంత మాత్రమున ద్విజుడు శ్వేతముఖుడు కాలేడని కవి విమర్శించాడు.

పేజీలు : 75

Write a review

Note: HTML is not translated!
Bad           Good