హంసలదీవి వేణుగోపాలస్వామి ఎంతో మహిమ గల దైవం. 1977లో ఉప్పెన వచ్చి, కృష్ణజిల్లా దివిసీమ అతలాకుతలమైనప్పుడు, స్వామివారి ఆలయం చెక్కు చెదరకుండా ఉండటమే కాదు, ఆ ఆలయాన్ని ఆశ్రయించినవారు సురక్షితంగా ఉన్నారని లోక కథనం.

హంసలదీవి గోపాలునిపై భక్తిప్రపత్తులున్న శ్రీ కాసుల పురుషోత్తమ కవి రచించిన శతకమిది. పురుషోత్తమ కవి ''ఆంధ్రనాయక శతకం'' ఎంత సుప్రసిద్ధమో క్రొత్తగా చెప్పుకోనవసరం లేదు. ఎందుకో ఏక కవి కృతమైనా, ఆంధ్రనాయక శతకానికి వచ్చినంత ప్రచారం ఈ హంసలదీవి శతకానికి రాలేదు. ఈ శతకంలోని పద్యాలు మనోహరాలు, పురుషోత్తమ కవి భావనా పటిమకు, భక్తికి నిలువెత్తు సాక్ష్యాలు.

పేజీలు : 78

Write a review

Note: HTML is not translated!
Bad           Good