ప్రకృతి పురుషుల ప్రతి కదలికలో ఆవేదానంద నమ్మిశ్రితాలైన అనేకానేక గాధలు సముద్భవిస్తుంటాయి. ఆ గాథల కథాసాహితీ ప్రపంచంలో అజరామరాలై నిలిచి ఉంటాయి. మానవలోకానికి విజ్ఞానాన్ని, వినోదాన్ని కలిగిస్తుంటాయి. అక్షరమైన ప్రతికథ అక్షయ సందేశాన్ని ప్రసారం చేస్తూనే ఉంటుంది.
ఎక్కడో సూర్యోదయం జరుగుతుంది. ఆ వెలుతురు సర్వ ప్రపంచాన్ని స్పృజిస్తుంది. ఎక్కడో ఒక సంఘటన జరిగింది. అది ఒక కథ అయ్యింది. ఆ కథ ప్రసరించింది. దిక్కులను చుంబించింది. ప్రకృతిని స్పృజించింది. మేధస్సుల్ని కదిలించింది. తాను సంకేతమై కూర్చుంది. ఆ సంకేతమే ముడి, ఆ ముడి విప్పాలి, అప్పుడే ఆ కథ భాసిస్తుంది.
ఆ ముడే పొదుపు. ఆ పొడుపుకు విడుపు కావాలి. ఆ విడుపే విజ్ఞానం, వినోదం, కారు చీకటిని చీల్చుకుని వచ్చే కాంతికిరణం, కథాత్మకమైన పొడుపుల్లో పొడుపొక ప్రశ్న. కథ ఒక సమాధానం, పొడుపొక సంకేతం. విడుపొక సంఘటన. ఈ సంకేత సంఘటనల్లో మొదట పుట్టేది సంఘటనే. సంఘటన లేనిది సంకేతం లేదు. సంకేతం లేకున్నా సంఘటన ఉంటుంది. ఆ సంకేతం తెలిసినవాడు పొడుస్తాడు. ఆ సంఘటన తెలిసినవాడు విప్పుతాడు. అయితే కథాత్మక ప్రహేళికల్లో పొడచినంత సులభంగా విప్పడం సాధ్యం కాదు. విప్పడానికి కొంత సమయం కావాలి.
పొడుపు కథలు ఆలోచనా ప్రేరకాలు. జ్ఞాపకశక్తి దోహదాలు. లోకజ్ఞతకు బుద్ధికుశలతకు ఆయువు పట్టులు. మరొకదృష్టితో అవి కాలక్షేపం కోసం, వినోదం కోసం అనుకున్నా, అవి మరొకవైపు ఎదుటివాడి కుతూహలాన్ని ప్రేరేపిస్తాయి. వ్యంగ్యాన్ని, వ్యవహార జ్ఞానాన్ని పరిరక్షిస్తూ మానసిక వికాసానికి, భావ సమైక్యతకు తోడ్పడుతాయి. పదాలలోని క్రమపద్ధతి భాషా నైపుణ్యాన్ని పెంచుతుంది. ఇది ఎల్లరకు పరనీయాలు. ఆలోచనీయాలు.
ఈ గ్రంథ సంపాదకులు శ్రీ వెలగా వెంకటప్పయ్య గారు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good