మెదడుకు మేత
జానపదుల అపారమేథాశక్తి నుంచి, విస్తృత అవగాహన నుంచి, జీవితానుభవాన్నుంచి పుట్టుకొచ్చినవి సామెతలు, పొడుపు కథలు. నిత్య జీవితంలో జానపదులు గమనించిన, అనుభవించిన విషయాలే పొడుపు కథలు. అలనాటి సామెతల్లో, పొడుపు కథల్లో ఎన్నో జీవిత సత్యాలు ఆవిష్కరింపబడతాయి. తరతరాలకు అవి మార్గదర్శకాలుగా వుంటాయి. ఇవి జ్ఞానోదయాన్ని కల్గించి, నిగూఢమైన అర్థాన్ని వెల్లడిస్తాయి. ముఖ్యంగా పొడుపు కథలు మెదడుకు మేత వేస్తాయి. ఆలోచనల్ని ప్రేరేపిస్తాయి. తెలివితేటలకు సానబెట్టి పదును పెడ్తాయి. జ్ఞానతృష్టను కలిగిస్తాయి. ప్రకటనా సామర్ధ్యాన్ని పెంపుజేస్తాయి. సమస్యలను పరిష్కరించగలిగే కౌశలాన్ని పెంచుతాయి. స్ఫూర్తిని కలిగిస్తాయి.
ఈ పుస్తకాన్ని ఆసాంతం చదివి వంటబట్టించుకున్న ఆబాలగోపాలం విద్యన్మణులుగా ప్రకాశిస్తారు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good